- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


పాంచ్ పటాకా అన్నట్లుగా అయిదురుగు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి .. జ‌గ‌న్ కు గుడ్ బై చెప్పేశారు. ముందు వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్సీ గా పోతుల సునీత నిలిచారు. ఆ త‌ర్వాత ఆమె బాటలో కర్రి పద్మశ్రీ , కళ్యాణ్ చక్రవర్తి , జయ మంగళ వెంకట రమణ నడిచారు. ఇక తాజాగా వైఎస్సార్ కుటుంబానికి ఎప్పటి నుంచో వీర విధేయుడిగా ఉంటూ వ‌స్తొన్న చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పార్టీని వీడి వెళ్ళారు. ఇపుడు వైసీపీ ని వీడి వెళ్లే ఆరో ఎమ్మెల్సీ ఎవరా అని చర్చ ? అయితే జోరుగా సాగుతోంది. అయితే ఆ ఆరవ ఎమ్మెల్సీ పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆయ‌న ఎవ‌రో ?  కాదు..  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే అవుతారట‌. ఆయ‌న మూడు దశాబ్దాల రాజకీయ జీవితం కలిగిన సీనియర్ మోస్ట్ నేత తోట త్రిమూర్తులు అని టాక్ ?  తోట‌ 1994లో తొలిసారి రామచంద్రపురం నుంచి గెలిచారు .. ఆ త‌ర్వాత అన్ని పార్టీలు మారారు. ప‌లుసార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. టీడీపీ - కాంగ్రెస్ - ప్ర‌జారాజ్యం - తిరిగి టీడీపీ ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఆయ‌న వియ్యంకుడే జ‌గ్గ‌య్య‌పేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను.


ఎన్ని సార్లు పార్టీలు మారినా ఆయ‌న మంత్రి అవ్వాల‌న్న కోరిక మాత్రం నెర‌వేర లేదు. ఇప్పుడు ఆయ‌న త‌న కుమారుడిని రాజ‌కీయ వార‌సుడిగా చూసుకోవాల‌ని అనుకుంటున్నారు. ఇక తోట‌ జనసేనలోకి వెళ్తారని ప్రచారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ప్ర‌స్తుతానికి తోట‌ జిల్లాలో వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నా అమరావతికి వెళ్తే మాత్రం టోన్ మారుతోందని గుస‌గుస లు ఉన్నాయి. ఇటీవ‌ల బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా తోట త్రిమూర్తులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా మెలగడంతో ఆయన రూట్ ఎటు వైపు ? అన్నది మరింతగా చర్చ లోకి వ‌చ్చింది. పైగా గోదావ‌రి జిల్లా లో కాపుల డామినేష‌న్ ఉంటుంది. అదే వ‌ర్గానికి చెందిన తోట అక్క‌డ బ‌లంగా ఉన్న జ‌న‌సేన లో ఉంటేనే క‌రెక్ట్ అని ఆ సామాజిక వ‌ర్గం నుంచి ఒత్తిడి ఉంద‌ట‌. అందుకే ఆయ‌న కండువా మారుస్తార‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: