- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ‌లో కేబినెట్ విస్త‌ర‌ణ ఎప్పుడు ఉంటుందా ? అని చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు అయితే కేబినెట్ విస్త‌ర‌ణ .. మంత్రి ప‌ద‌వి కోసం ఓ రేంజ్ లో త‌హ‌త‌హ లాడిపోతున్నారు. తెలంగాణ కేబినెట్లో మొత్తం 18 మంది మంత్రుల‌కు అవ‌కాశం ఉంది. కానీ ఇప్ప‌టికే కేబినెట్లో 6 బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ఓ వైపు ప్ర‌భుత్వం ఏర్ప‌డి 16 నెల‌లు అవుతున్నా ఇంకా ఇన్ని బెర్త్‌లు ఖాళీగా ఉండ‌డంతో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది.


ఇక ఈ బెర్త్‌ల కోసం ఆశావాహులు పెద్ద‌ల చుట్టూ ప్ర‌దక్షిణ‌లు చేస్తున్నారు. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారి కేబినెట్ విస్త‌ర‌ణ గురించి చ‌ర్చ న‌డుస్తోందే త‌ప్పా కేబినెట్ ను విస్త‌రించ‌డం లేదు. ఇక మంత్రి ప‌ద‌వి పై ఆశలు పెట్టుకున్న వారిలో చాలా మంది ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేరు ప్ర‌ధానంగా రేసులో ఉంది. ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సోద‌రుడు వెంక‌ట రెడ్డి మంత్రి గా ఉన్నారు ... ఇక ఇద్ద‌రు సోద‌రుల‌కు అవ‌కాశం ఉంటుందా ? అన్న‌ది చూడాలి.


ఇక సీనియ‌ర్ ఎమ్మెల్యే .. మాజీ మంత్రి సుద‌ర్శ‌న్ రెడ్డి సైతం మంత్రి ప‌ద‌వి పై ఆశ‌ల‌తో ఉన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి మ‌ల్ రెడ్డి రంగారెడ్డి పేరు కూడా రేసులో ఉంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ నుంచి ఆయ‌న పేరే ప్ర‌ముఖంగా ఉంది. అయితే ఇప్ప‌టికే రెడ్లు ఎక్కువుగా ఉన్నారు. అందుకే మ‌ల్ రెడ్డికి చీప్ విప్ ప‌ద‌వి రేవంత్ ఆఫ‌ర్ చేయ‌గా .. ఆయ‌న త‌న‌కు మంత్రి ప‌ద‌వి త‌ప్పా మ‌రే ప‌ద‌వి వ‌ద్ద‌ని చెప్పార‌ట‌. ఇలా రేసులో చాలా మంది ఉన్నారు. మ‌రి బుగ్గ కారులో కూర్చొనే ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రికి వ‌స్తుందా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: