
ప్రముఖ సినీ నటుడు .. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి దారె టు? ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్టేనా ? ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా ? లేదా ? అన్నది క్లారిటీ లేదు. పోసాని వైసీపీలో ఉంటారని ఆ పార్టీ నాయకులు అయితే చెపుతున్నారు. కాదు ఈ సారి ఆయన చేసిన పనులకు .. జైలు శిక్ష నేపథ్యంలో రాజకీయాలు చేయరని .. ఆయన పూర్తి సైలెంట్‌గా నే ఉంటారని మరి కొందరు చెపుతున్నారు. ఇలా పోసాని రాజకీయ జీవితం పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
ఇక వరుసగా కేసులు నమోదు కావడం .. జైలు శిక్ష అనుభవించడం దీనికి తోడు అనారోగ్య సమస్యలు .. ఆ జైలు .. ఈ జైలు అంటూ పోలీసు అధికారులు ప్రదక్షిణలు చేయించడంతో పోసాని సహజంగానే విసిగిపోయారు. దీనికి తోడు ఆయన లో రాజకీయాల పట్ల వైరాగ్యం ఏర్పడిందని కూడా చెపుతున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని మరింతగా రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ .. చంద్రబాబు పై రెచ్చిపోయి మరీ విమర్శలు చేశారు. ఇవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనను జైలుకు వెళ్లేలా చేశాయి.
కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాను అసలు రాజకీయాలకు దూరంగా ఉంటానని పోసాని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు పోసాని రాజకీయాలు చేస్తారా ? చేయరా ? అన్న ప్రశ్న సహజంగానే వినిపిస్తోంది. ఏదేమైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడు వెళ్లినందుకే పోసాని విషయంలో తేడాకొట్టింది .. ఇదే ఆయనకు శరాఘాతంగా మారింది. ఏదేమైనా పోసాని రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశంలో లేరట. .