
తమ నియోజకవర్గాలలో టిడిపి ఇన్చార్జిలు మాటే చెల్లుతోందని ఎమ్మెల్యేలను ఎవరు అసలు పట్టించుకోలేదంటూ తెలియజేశారట. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉండే జనసేన టిడిపి మధ్య సవన్మయంలోపిస్తోందనే విధంగా కూడా ప్రచారం కొనసాగుతోందట. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది నేతల మాటలు చెల్లలేదని వార్త కీలకంగా ప్రచారం చేసుకుంటున్నారట. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలలో మంత్రులుగా ఉన్న ముగ్గురు తప్ప మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలు చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఎదుర్కొంటున్నట్లు వివరించారట. అధికారులు ఎవరూ కూడా తమ మాట పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
తమ నియోజకవర్గాలలో టిడిపి ఇన్చార్జిలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నదని కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మనోహర్, దుర్గేష్ నియోజకవర్గం లో మాత్రమే వారు చెప్పిన మాటలు చెల్లుతున్నాయి తప్ప ఇతర నియోజకవర్గాలలో అసలు పట్టించుకోలేదని తెలియజేశారట. ఒకవేళ ఇదే రకంగా భవిష్యత్తులో కూడా కొనసాగితే నియోజకవర్గం లో జనసేన పార్టీకి విలువ లేకుండా పోతుందని పరిస్థితులలో మార్పులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అంటే మంత్రి నాదెండ్ల మనోహర్ తో విన్నవించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో పార్టీ పరిస్థితులు ప్రజలతో మమేకం కావలసిన అంశాల పైన కూడా చర్చించుకున్నట్లు సమాచారం. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి తెలిసేలా సమావేశం ఏర్పాటు చేయాలని తెలియజేశారట.