ప్రస్తుతం సోషల్ మీడియాలో, టీవీలలో, న్యూస్ చానల్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బెట్టింగ్ యాప్స్. ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారిపైన పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది యూట్యూబర్లు, నటులు, సెలబ్రిటీలు కొంతమందిని అరెస్టు చేయడం వంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ లో చాలామంది ఫేమస్ అయిన యూట్యూబర్లు, హీరోయిన్లు, హీరోలు ఇలా ఎంతోమంది పైన కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.



ఈ క్రమంలోనే తాజాగా చాలామంది క్రికెటర్ల పేర్లు  కూడా తెరపైకి వస్తున్నాయి. కొంతమంది ప్రముఖ క్రికెటర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లలో డబ్బులను సంపాదిస్తున్నారని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలపై గ్రీన్స్ సొసైటీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. గ్రీన్స్ సొసైటీ సభ్యులు తాజాగా ఈ విషయం స్పందించారు.


బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లలో డబ్బులు సంపాదించిన వారిని వదిలిపెట్టి యూట్యూబర్లను, సామాన్య మానవులను అరెస్టు చేయడం సరికాదు అని హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కోహ్లీ అంతేకాకుండా బాలీవుడ్ హీరోలు షారుక్ ఖాన్ ఇంకా మరి కొంతమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అంతేకాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా చాలామంది హీరోలు, హీరోయిన్లపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు.


ఇప్పటికే కొంతమంది నటులు, సిని సెలబ్రిటీలు, యూట్యూబర్ లను అరెస్ట్ చేశారు. ఇక కొంతమంది మీద అనుమానం ఉన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారణ చేసి అనంతరం వారిని వదిలిపెట్టి పంపించారు. మరి ఈ విషయం పైన పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం సరికాదు అంటు కొంతమంది సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: