ప్రస్తుతం అంతా కూడా ఎక్కువగా సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. అందుకే ఎలాంటి చిన్న తప్పు జరిగిన సరే ఎక్కువగా ట్రోలింగ్ వంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రోలర్స్ బారిన ప్రముఖులే కాకుండా రాజకీయ నేతలు, అధికారులు ఇలా చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో ఇది ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్యలో నారా లోకేష్ మీద ఎన్ని రకాల ట్రోల్స్ వైరల్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. వాటన్నిటిని తట్టుకొని నిలబడి మరి నారా లోకేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు.


2017 నుంచి 2019 మధ్యలో మంత్రిగా కూడా పనిచేశారు నారా లోకేష్ ఆ సమయంలో భారీ ఎత్తున ట్రోల్స్ వినిపించాయి. కానీ ఈమధ్య లోకేష్ గురించి ట్రోల్స్ భారీగా తగ్గాయి..కానీ పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ ఒక రేంజ్ లో వినిపిస్తూ ఉన్నాయి.. కారణాలు అన్నది అనేక రకాలుగా ఉన్నాయి.. కూటమిలో ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తున్న మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. అయితే ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ చేసే హడావుడి మాటలే కాకుండా ఆయన చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉంటుందని.. వీటికి తోడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యల వల్ల కూడా మళ్లీ ట్రోల్ కి గురవుతున్నారట పవన్ కళ్యాణ్.


ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో కూడా మాట్లాడిన మాటలు ట్రోల్ కి గురయ్యాలా చేస్తున్నాయని.. చాలామంది కూడా పవన్ కళ్యాణ్ ని మాట మీద నిలకడ లేని మనిషి అంటూ కూడా చాలా సందర్భాలలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.ముఖ్యంగా గతంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం మాట్లాడే మాటలకు అసలు పొంతనే ఉండదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలి అంటే తక్కువ మాట్లాడి.. జాగ్రత్తగా మాట్లాడి పని ఎక్కువ చేయాలని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: