
పల్నాడు జిల్లా చిలకలూరిపేట కు చెందిన మాజీ మంత్రి .. వైసీపీ మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ పై ఒక్కొక్కరు బయటకు వస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకు టీడీపీ లో ఉన్న ఆమె అనంతరం వైసీపీ కండువా కప్పుకుని చిలకలూరిపేట సీటు సొంతం చేసుకుని ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆమె జగన్ కేబినెట్లో అనూహ్యంగా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కూడా అయిపోయారు. అయితే ఐదేళ్ల పాటు అమె పై అటు ఎమ్మెల్యే గా చిలకలూరి పేట లోనూ .. ఇటు మంత్రి గా తన శాఖలో నూ తీవ్రమైన ఆరోపణలు అయితే వచ్చాయి. ఇప్పుడు అధికార పార్టీ నేతలు సైతం రజనీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇక తాజాగా నరసారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయుల పై రజనీ చేసిన ఆరోపణలకు లావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక తాజాగా మాజీ మంత్రి విడుదల రజిని చేసిన అరాచకంపై నాడు వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు ఆమె అనుచరుడిగా పేరుపొందిన గోల్డ్ శ్రీను గారు తనకు మాజీ మంత్రి చేసిన అన్యాయం పై స్పందిస్తూ విమర్శలు చేశారు.
తనకు మునిసిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని మూడున్నర కోట్లు మాజీ మంత్రి విడదల రజనీ తన సొంతానికి తీసుకొని, రెండున్నర కోట్లు మున్సిపల్ ఎన్నికల ఖర్చులకు, కోటి రూపాయలు వార్డు ఖర్చులకు మొత్తం ఏడు కోట్ల రూపాయలు తనతో ఖర్చు పెట్టించారని ... చివరకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా తనని దారుణంగా మోసం చేశారంటూ విడదల రజిని పై నిప్పులు చెరిగారు గోల్డ్ శ్రీను. ఇక మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన రజనీ నిజాయితీ కి నిలువుటద్దం అయిన ఎంపీ లావుపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు.