మాజీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అన్నటువంటి దాన్ని విపరీతంగా ఇచ్చేసి దాదాపు లక్ష కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసినటువంటి జగన్.. జనం చీ కొట్టారు 11 స్థానాలకే పరిమితమయ్యారనే విధంగా కూటమినేతలు ఎద్దేవ చేస్తూ ఉన్నారు. అంటే సంక్షేమం ప్రజలకు పెద్దగా ఇష్టం లేదా?అందుకే సూపర్ సిక్స్ గురించి మనం ఎంతో కొంత ఆశిస్తున్నారు కానీ అంత కూర్చోబెట్టి మేపినట్టుగా ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారనే విధంగా.. వ్యాపారస్తులు, సంక్షేమ పథకాలను వద్దని కోరుకుంటున్నారు.. రైతులు వద్దని కోరుకుంటున్నారు. తటస్తులు కూడా వద్దని కోరుకుంటున్నారు. కాబట్టి సంక్షేమాలు నిదానంగా ఇద్దామని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందట.


అలాగే పూర్తిగా ఇవ్వకపోతే కష్టమని .. ఇద్దాం.. ఎన్నికలు వచ్చే ఏడాది ముందు లోపు పథకాలను తీసుకోవద్దం ఈలోపు ప్రజలకు సంబంధించిన అభివృద్ధి రుచులు కూడా చూపిద్దామనే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారట. అమరావతిని డెవలప్ చేసి చూపిద్దాము, అలాగే వివిధ ప్రాంతాలలో రోడ్లను కూడా ఏర్పాటు చేయాలని వీటివల్ల పాజిటివ్ ఇమేజ్ను తీసుకువచ్చేలా చేసుకుందామని.. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని సదుపాయాలు కల్పిస్తే.. ప్రజలు ఇలాంటి ప్రభుత్వమే కావాలని కోరుకుంటారని మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


 అభివృద్ధికి అగ్ర ప్రాధాన్యత ఇచ్చి.. సంక్షేమం కూడా ఉంటే చాలని కోరుకుంటారు.. అదే లెవెల్లో పార్టీకి గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకంగా ఉండే శక్తులన్నిటినీ కూడా అందరిని అణచివేస్తే అధికారంలో కంటిన్యూ అవ్వడం సులభమని టిడిపి ఆలోచనట.పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలాగైనా మనతో ఉంటారు.. కాపు సామాజిక వర్గం 100 కి 90 శాతం మంది పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు.. మిగతా పదిమందిలో ఐదు మంది మన వెంట ఉంటే ఐదు మంది ఇప్పుడు జగన్ వెంట ఉన్నారు కాబట్టి.. కాపులు పవన్ కళ్యాణ్ తో ఎంత కాదనుకున్న 60 శాతం వరకు ఉంటారు.. అతనితో ట్రావెల్ అవుతారు పవన్ కళ్యాణ్  మనతో ఉంటారు కాబట్టి చాలు మనం మళ్లీ ఎలక్షన్స్ లో కూడా గెలవవచ్చు అనే ధీమాతో టిడిపి భావిస్తోందట.. అలాగే పవన్ కళ్యాణ్ ని ఎలాగైన కన్విన్ చేసి లోకేష్ ని సీఎంగా ఒప్పించడం చేస్తే టిడిపి పార్టీకి భవిష్యత్తులో ఎలాంటి డోకా లేదని టిడిపి పార్టీ ఆలోచనట..మరి ఈ పాయింట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: