తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరూ కూడా ఢిల్లీలోనే మంతనాలు జరుపుతున్నారు. అధిష్టానం నుంచి తెలంగాణ కేబినెట్ విస్తరణ పై గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే హుటాహుటిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లడం జరిగింది.

 

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పై.. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు నిర్వహించారట. ప్రాథమిక సమాచారం ప్రకారం... దాదాపు 25 మంది... పదవుల కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్నారట. ఈసారి విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించేలా.. చర్యలు తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే చివరకు నలుగురి పేర్లను పరిశీలనలో ఉంచిందట కాంగ్రెస్ అది స్థానం. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు.


 
అలాగే... గడ్డం వివేక్ తో పాటు సుదర్శన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ నలుగురితో పాటు ఇద్దరిపై వేటువేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది.  ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొండా సురేఖ అలాగే జూపల్లి కృష్ణారావు లపై... కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసిందట. కొండ సురేఖ అలాగే జూపల్లి కృష్ణారావు లను తొలగించి విజయశాంతితో పాటు ప్రేమ్ సాగర్ రావులకు అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిందట ఆ కాంగ్రెస్.

 
ఇటీవల విజయశాంతి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెకు హోం మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. ఇక మరో రెండు పదవులను హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలకు  ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మైనారిటీ అలాగే ఎస్టి కోట కింద పెండింగ్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: