
వీరిద్దరు ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకుంటున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందనేది కూడా చూడాల్సి ఉంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఉన్న బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ యజమానిని బెదిరించి అతని నుంచి రూ.2 కోట్లను అప్పటి మంత్రిగా ఉన్న విడుదల రజనీ తీసుకున్నారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఇందుకోసం ఆమె అప్పట్లో పోలీసు ఉన్నతాధికారిగా వ్యవహరించిన ఐపీఎస్ జాషువా సహకరించారని.. బెదిరించి సొమ్ములు వసూలు చేశారన్న ఆరోపణతో పాటు ఈ విషయంలో రజనీ మంత్రి గోపీ కీ రోల్ పోషించారన్నది టీడీపీ వాళ్ల ఆరోపణ. ఈ విషయంలోనే రజనీపై ఏబీసీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదంతా ఎంపీ లావు శ్రీ కృష్ణ డైరెక్షన్‌లో జరిగిందని.. తనకు ఏమీ తెలియదని రజనీ చెపుతోంది. దీనికి ఎంపీ లావు కూడా కౌంటర్ ఇస్తూ ఈ కేసుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బాలాజీ క్రషర్స్ యజమానితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక విడదల రజనీనే తన వద్దకు రాయబారం పంపించారని చెప్పారు. ఈ కేసులో విడదల రజనీ ముద్దాయేనని వ్యాఖ్యానించారు. ఇక లావు, రజనీ మధ్య వైసీపీ లో ఇద్దరూ ఎంపీ, ఎమ్మెల్యే గా ఉన్నప్పటి నుంచే పగ ఉంది. ఇది ఇలా కంటిన్యూ అవుతోంది.