తెలంగాణలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు అనార్హత భయం వేటాడుతుంది. స్పీకర్ తప్ప.. మరొకరి పేరుపై అనర్హత వేట్టు వేసే అవకాశం లేదు. కానీ.. సుప్రీంకోర్టు నిర్దిష్ట గడువులోపే నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తుంది. మీరు చెప్పకపోతే.. మేము గడువు చెప్పాల్సి వస్తుందని.. అసెంబ్లీ కార్యదర్శి కూడా  ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. దీంతో.. ఎందుకైనా మంచిదన ఉద్దేశంతో ఎమ్మెల్యేలు తమ పార్టీ మారలేదన్న వాదన వినిపించడానికి రెడీ అయ్యారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ.. ఇది టెక్నికల్గా నిరూపించడం దాదాపు అసాధ్యం. కండువాలు కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారారని అర్థం కాదని వాదించే అవకాశం ఉంది.


పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. ఇప్పటికే తన పార్టీ మారలేదని మర్యాదపూర్వకంగా కలిశానని.. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. తనకు కప్పిన కండువా కాంగ్రెస్ పార్టీ కండువా కాదని ఆయన చెప్పబోతున్నారు. గద్వాల్ ఎమ్మెల్యే అయితే తన పార్టీ మారినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. ఇదంతా సుప్రీంకోర్టులో చూపించుకోవటానికి.. సాంకేతికంగా వారు పార్టీ మారినట్టు నిరూపించాలంటే విప్‌ ఉల్లంఘించినట్టుగా నిరూపించాలి. ఇప్పటి వరకు వీరు ఎలాంటి విప్ ఉల్లంఘించలేదు. ఇక బిఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది.


కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పుకోలేరు. అలాగని బిఆర్ఎస్‌లో ఉన్నామని ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేరు. వీరిపై అనర్హత వేటు వేయించి ఉప ఎన్నికలు తీసుకురావాలని బిఆర్ఎస్ కోరుతోంది. అయితే బిఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ మారతారని.. ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని.. రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీ చేరికలలో కాంగ్రెస్ పార్టీకి సరైన వ్యూహం లేకపోవడం వల్ల ఈ పరిస్థితని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పుడు ఒకరిని.. అప్పుడు ఒకరిని.. చేర్చుకోవడం వల్ల విలీనం స్థాయిలో ఎమ్మెల్యేలు రాలేదు. చాలామంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా వారు కూడా ఆగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: