
ఇదిగో ఈసారి మంత్రివర్గ కూర్పు ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోవడంతో విజయశాంతికి కూడా మంత్రి పదవి దక్కుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి ఈ దఫా అయినా అది నిజమవుతుందా లేదా వేచి చూడాలి.
ఇదంతా ఒక ఎత్తయితే, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా జపాన్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. తెలంగాణ సీఎం ఆఫీసు ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే. జపాన్‌లోని ప్రముఖ కంపెనీలు, పెట్టుబడిదారులతో తెలంగాణకు వ్యాపార సంబంధాలు కుదుర్చుకోవడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవడం ఈ పర్యటనలో ప్రధానాంశాలు.
అంతేకాదు, రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో కూడా పాల్గొనబోతున్నారు. ఏప్రిల్ 13న ప్రారంభమయ్యే ఈ వరల్డ్ ఎక్స్పో ఆరు నెలల పాటు కన్సాయ్, జపాన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రపంచంలోని మేటి మేధావులు, దేశాలు పాల్గొనే ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మొత్తానికి రేవంత్ ఢిల్లీ పర్యటనలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతుంటే, జపాన్ టూర్ మాత్రం అభివృద్ధిపై ఆయనకున్న ప్రత్యేక దృష్టిని చాటుతోంది. మరి రేవంత్ రెడ్డి ఈ టూర్ల ద్వారా తెలంగాణకి చివరికి మంచి చేశానని నిరూపించుకుంటారా లేదో చూడాలి.