
అయితే ఆ తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి EO ధర్మారెడ్డి గారి హయాంలో చేసుకొచ్చినటువంటి ఫార్ములా ఏమిటంటే.. బ్రేక్ దర్శనాన్ని 9:30 నుంచి 10 గంటలకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఉదయాన్నే సుప్రభాతం, ఏవైతే అర్చన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ అయిపోయిన తరువాతనే బ్రేకింగ్ దర్శనం అయ్యేటువంటి కాన్సెప్ట్ తో కంటిన్యూగా భక్తులకు దర్శనం అవకాశం కల్పిస్తూ ఉండేదట.. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి దేశం నలుమూలల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు.
అలా 9 నుంచి 10 గంటల లోపే దర్శనం చేసుకొని వీరు బయటికి వచ్చేవారు.. అలా కాకుండా పొద్దున్నే బ్రేక్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఆ బ్రేక్ దగ్గర కనీసం రెండు గంటల సమయం అన్నపడుతుందట. విఐపి బ్రేక్ దర్శనాలలో రెండు గంటలలో మాక్సిమం 5000 మంది దర్శనం చేసుకుంటే ఆ సమయంలో.. అయితే సామాన్యుల సైతం సుమారుగా 15 నుంచి 20వేల వరకు దర్శనం చేసుకుంటారట. ఆ స్థాయిలో ఉంటుంది అక్కడ ఉచిత దర్శనాలు. అయితే ఈ బ్రేక్ దర్శనాలకు ముందు రోజున రావాల్సి ఉండే పరిస్థితి కూడా లేదట.. రూములు ఖాళీగానే దొరికేవట.. అయితే ఇప్పుడు మళ్లీ బ్రేక్ దర్శనాలని ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారట.. దీనివల్ల అటు రూములు మీద ప్రెషర్ పడుతుంది సామాన్య భక్తుల మీద కూడా ప్రెజర్ పడుతుంది. మరి గతంలో లాగా ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు దర్శనాన్ని కంటిన్యూ చేస్తే టిటిడి మీద ప్రెజర్ తగ్గుతుంది.. లేకపోతే బ్రేక్ దర్శనాన్ని ముందుకు తీసుకువెళ్లడం బెటర్ అనుకుంటారో చూడాలి.