
అందుకే ఉమ్మడి జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ పైన తేల్చాలంటూ పలువురు నిరుద్యోగులు ఉపాధ్యాయుల సైతం రోడ్ ఎక్కి మరి పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడం జరుగుతోంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు నిరుద్యోగులకు హామీలు ఇచ్చారు ఆ హామీలను అసలు పట్టించుకోకుండా ఉంటున్నారంటూ నిలదీస్తున్నారు.అంతేకాదు ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉండడానికి కారణం ఏంటో చెప్పాలి అంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైన చేసినప్పటికీ ఇప్పటివరకు అందుకు సంబంధించి ఎలాంటి నిర్వహణకు కూడా నోచుకోలేదు
నిరంతరం ఏదో ఒక సాకు చెప్పి రోజు రోజుకి ఆలస్యం చేస్తున్నారు తప్ప.. ఎప్పుడు విడుద చేస్తామని చెప్పలేదు.. దీంతో విద్యార్థులతో పాటు నిరుద్యోగులకు కూడా అసహనం మొదలవుతోంది. ఉపాధ్యాయ పోస్టులకు వెళ్లేందుకు నెలల తరబడి కోచింగ్ సెంటర్లు కోచింగ్ తీసుకుంటూ ఉండగా ఇందుకోసం ప్రతినెలా కూడా వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నదంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు.. మరొకవైపు కేవలం పోస్టుల కోసం ఎదురుచూపులే తప్ప మెగా డీఎస్సీ నిర్వహించేలా కనిపించడం లేదంటూ కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మేల్కొని ఈ మెగా డీఎస్సీ పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.