
ఓ తమిళ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. కానీ.. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశానికి కూడా ఉపముఖ్యమంత్రి ఖాతాలో పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ఈ సమావేశంలో చంద్రబాబు పక్కన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం.. సీట్ కేటాయించిన పవన్ కళ్యాణ్ రాకపోవడంతో అధి ఖాళీగా కనిపించింది. పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆ సీటు అలాగే ఖాళీగా ఉంచి.. పక్క సీటులో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కూర్చున్నారు. ఇతర మంత్రులతో పోలిస్తే ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్‌కు హాజరయ్యేది తక్కువే అని చెప్పాలి.
ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు.. ఇప్పుడు కలెక్టర్ల సమావేశానికి డుమ్మా కొట్టారు. పార్టీ వర్గాలు పవన్ కళ్యాణ్ కు నడుము నొప్పి అని చెబుతున్నా.. సొంత కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నిజంగా నడుమునొప్పి ఉన్న వ్యక్తి అయితే పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ అంతగా ఊగిపోతూ మాట్లాడుతారా అని చర్చ కూడా సాగుతుంది. పలు సమావేశాలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ రాకపోయినా.. చంద్రబాబు నాయుడు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని చర్చ సాగుతోంది. జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మాత్రం.. చంద్రబాబుతో కలిసి అన్ని సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు.