
అయితే కొడాలి నాని కి ఈరోజు తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని ముందుగా సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య సమస్యపై ఇంకా అధికారికంగా వైద్యులు ప్రకటించాల్సి ఉన్నది. ఈ విషయం తెలిసిన వెంటనే అటు కొడాలి నాని అభిమానులు ,పలువురు వైసీపీ నేతలు హుటాపుటిగా కొడాలి నాని ఇంటికి చేరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది హాస్పిటల్ కి చేరుకొని మరి కుటుంబానికి ధైర్యం చెబుతున్నారట..ఈ విషయం తెలిసిన పార్టీ నేతలతో పాటు అభిమానులు కూడా త్వరగా ఈయన కోలుకోవాలని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు.
వైసిపి పార్టీ అధికారంలో ఉన్న సమయంలో భారీగానే క్రేజీ సంపాదించిన కొడాలి నాని .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మీద కూడా చాలానే కేసులు నమోదు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాల పైన గతంలో నాని తన మీద తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు చేశారంటూ తెలియజేశారు. ఈ విషయం మీద కోర్టు వరకు కూడా వెళ్లారు కొడాలి నాని. మరి ఇలాంటి సమయంలో ఒక్కసారిగా నానికి గుండెపోటు రావడం జరిగింది.. త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.