గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం రాజకీయాలు ఒక సారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి విడుదల రజనీ వర్సెస్.. మరో మాజీ మంత్రి ప్రస్తుత చిలుకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు.. అటు నరసరావుపేట టిడిపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజకీయంగా ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలతో.. చిలకలూరిపేట రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక్కసారిగా చిలకలూరిపేట టిడిపి శ్రేణుల‌లో ఎక్కడా లేని సంబరాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ టిడిపి క్యాడర్ అంతా.. విడుదల రజినిని టార్గెట్గా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.


వారిలో విడుదల రజని బాధితులు కూడా చాలామంది ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో గోరుచుట్టుపై రోకలి పోటు.. అన్నట్టుగా ఎమ్మెల్యే ప్రతిపటి పుల్లారావు చేసిన రాజకీయం సక్సెస్ అయ్యింది. ఇకపై ఎవరు ఎవరిపైన జాలి పడాల్సిన అవసరం లేదు. రాజకీయం అంటే అంతే. ప్రత్యర్థులు తీరు ఇంతే.. అన్నట్టుగా చిలకలూరిపేట రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో రజిని మంత్రిగా ఉన్నప్పుడు పుల్లారావు కుమారుడుపై.. జిఎస్టి అధికారులు కేసు నమోదు చేసినప్పుడు వైసిపి నాయకులు కూడా ఇలాగే చేశారని వాదన ఉంది. కాబట్టి.. ఇప్పుడు తన ప్రత్యర్థులపై పుల్లారావు ఇలా చేయడంలో తప్పేలేదు అనే టాక్ వినిపించింది.


ఇక తాజాగా టిడిపి ఆఫీస్‌కి వచ్చిన వారంతా.. గతంలో రజనీకి సొమ్ములు ఇచ్చిన వారే అని వారే చెబుతున్నారు. చాలామంది నుంచి లక్షలు కోట్ల రూపాయలు రజని సొమ్ములు తీసుకున్నారన్నది బాధితులు చెప్పే కథనాలను బట్టి తెలుస్తోంది. ర‌జ‌నీ పరివారం కూడా అందిన కాడకి లాగేసారాన్ని బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. మొత్తంగా కీలకమైన కేసు నడుస్తున్న సమయంలో రజ‌నీని మరింత డౌన్ ఫాల్‌ చేయడంలోనూ, ఆమెను మరింతగా ఇరుకున పెట్టడంలోనూ మాజీ మంత్రి పుల్లారావు వేసిన స్కెచ్ అద్భుతమైన రేంజ్ లో ఉందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో మోసపోతున్నారు.


ఇక పుల్లారావుకు తోడు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు కూడా జత కలిశారు. వీరిద్దరు గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీని.. రజని చాలా ఇబ్బంది పెట్టారు. ఇక రజనీ విషయానికొస్తే నలువైపులా నుంచి చుట్టుముట్టిన వివాదంతో.. ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క స్టోన్ క్రషర్ యజమానిచే కాకుండా.. సామాన్యుల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఆమె సొమ్మును వసూలు చేశారని వార్తలు బయటకు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలు కూడా రజనీ పై విమర్శలు చేస్తూ బయటకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు పేట రాజకీయంలో రజనీపై.. పుల్లారావు పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: