ఆయన పార్టీ మారారు. కానీ.. తన పంథా మాత్రం మార్చుకోలేదు. ఎక్కడ ఉన్నా తన స్టైల్ తనదే అని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన ప్రజలకు చాలా చేరువైన ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. పార్టీ ఏదైనా ఆయన గెలుపు ఖాయం అన్నది కూడా ఆయన మొన్న ఎన్నికల్లోనే ప్రూవ్ చేసుకున్నారు. వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. గత ఎన్నికలకు కొద్ది నెలల ముందు టిడిపి తీర్థం పుచ్చుకుని.. ఆ పార్టీ నుంచి కూడా గెలుపు గుర్రం ఎక్కారు. సాధారణంగా అనేకమంది ఇలా పార్టీలు మారి గెలిచినా.. కోటంరెడ్డి స్టైల్ వేరు.


ప్రజానేతగా.. నెల్లూరు రూరల్ ప్రజలకు ఆపద్బాంధవుడుగా.. కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నుంచి కోటంరెడ్డి ప్రజా సంక్షేమానికి ఎక్కువగా సమయం ఇచ్చేవారు. సొంత వ్యాపారాలు, వ్యవహారాలు ఎన్ని ఉన్నా.. వాటికంటే కూడా తన ప్రజలకు చేరువకావటం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేవారు. ఇలా ఆయన తనను తాను ప్రజలకు అంకితం చేసుకున్నారు. ఇది తర్వాత కాలంలో ఆయనను ప్ర‌జ‌ల‌కు మరింత చేరువ‌ చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల కోసం పాదయాత్ర చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు గట్టిగా నిధులు తెచ్చుకున్నారు.


అన్ని పార్టీల నాయకులను కలుపుకుపోవడం అభివృద్ధిలో భాగస్వామ్యం చేయుట కూడా కోటంరెడ్డికి చెల్లింది. ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి మించిన స్థాయిలో సేవలు అందించారు. ఆయన పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా అలాగే దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించారు. అది దక్కకపోయినా నియోజకవర్గంలో ప్రజలకు చేరువ అయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఏది ఏమైనా కోటంరెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. ఆయనకు తిరుగులేదు అని మరోసారి ప్రూఫ్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: