- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ మంత్రివర్గంలో నలుగురు కొత్త‌ మంత్రుల్ని తీసుకోనున్నారు. ఉగాదికి ప్రమాణ స్వీకారం ఉంటుందని టాక్ ?  రేవంత్ కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాలు , సామాజికవర్గాలను బేస్ చేసుకుని నలుగురి పేర్లను ఫైనల్ చేశారని అంటున్నారు. ఎస్సీ , బీసీ , ముస్లిం , రెడ్డి వర్గాల ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించిన‌ట్టు స‌మాచారం. ఇక ఎస్సీ వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్య‌యే వివేక్ వెంకటస్వామి ప్రధానంగా రేసులో ఉన్నారు. అయితే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా పోటీ పడుతున్నారు. ఆయనకు సామాజిక సమీకరణాల్లో అవకాశం దక్కడం ఖాయం అంటున్నారు.


ఇక మిగిలిన బెర్త్‌ల విష‌యానికి వ‌స్తే బీసీ వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ పేర్లు తుది దశలో ఉన్నాయి. ముదిరాజ్ వర్గానికి ఇవ్వాలనుకుంటే వాకిటి శ్రీహరికి.. మున్నూరు కాపులకు ఇవ్వాలనుకుంటే ఆది శ్రీనివాస్ కు ఇస్తారంటున్నారు. మున్నూరు కాపు వర్గం నుంచి ఇప్పటికే కొండా సురేఖ ఉండ‌డంతో ముదిరాజ్ కోటాలో శ్రీహ‌రికే బెర్త్ అంటున్నారు. మైనార్టీ వర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చిన అమీర్ అలీ ఖాన్ కు అవకాశం ఉంటుంద‌ని ... ఇక ఇదే మైనార్టీ కోటా లో అజారుద్దీన్ తో పాటు నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.


ఇక రెడ్డి వర్గం కోసం కేటాయించే స్థానంలో కోసం పోటీ మామూలుగా లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండటంతో బోధన్ ఎమ్మెల్యే '[సుదర్శన్ రెడ్డికి ప్ల‌స్ అవుతుంది. రెండు స్థానాలను ఖాళీగా ఉంచాలని అనుకుంటున్నారు. తీవ్రమైన ఒత్తిడి వస్తే మరో స్థానం భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా తెలంగాణ కేబినెట్ హ‌డావిడి ఇప్పుడు బాగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: