ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీ పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుందని చాలా క్యాజువల్ గా కేసులు పెడుతున్నారని వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని ఏదో కేసు నమోదు చేయాలని ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఏపీ ధర్మాసనం పేర్కొంది.
 
తప్పు చేస్తే కేసు పెట్టడం అరెస్ట్ చేయడం తప్పు కాదని కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య అని ఏపీ ధర్మాసనం పేర్కొంది. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలని ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడం గురించి మాకు చాలా విషయాలు తెలుసని ఏపీ ధర్మాసనం వెల్లడించడం గమనార్హం.
 
మేము కోర్టులో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసని అనుకోవద్దని పేర్కొన్నారు. పోలీసులకు సొంత రూల్స్ తో కూడిన మాన్యువల్ ఉందని దాన్ని కూడ ఫాలో కావడం లేదని కేవలం పోలీసులను మాత్రమే తప్పు పడితే సరిపోదని మా మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధిస్తున్నారని పేర్కొన్నారు.
 
వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని ఏపీ ధర్మాసనం వెల్లడించింది. రాబోయే రోజుల్లో కూడా పోలీసుల తీరు మారుతుందో లేదో చూడాల్సి ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మెజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించామని పేర్కొన్నారు. ధర్మాసనం తీరుతో పోలీసులు కొంతమేర మారాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో వైసీపీ నేతలపై తరచుగా కేసులు నమోదవుతూ ఉండటం, ఈ నేతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ కామెంట్లు జోరుగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హైకోర్టు సూచనలపై ఇతర పార్టీల నేతలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: