ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు ఉంటుందంటూ ఎన్నికల ముందు చెప్పడం ఆ తర్వాత అధికారంలోకి వచ్చి పెంచడం బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా అలా పెంచిన వారికి భారీ షాక్ తగిలేలా ఏపీ సర్కార్ పింఛని తీసుకొనే వారందరికీ తనిఖీలు సైతం నిర్వహించారు. అయితే ఇందులో అనార్హులు పింఛన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఈ విషయం పైన ప్రభుత్వం కూడా సీరియస్ గా పింఛని వ్యవహారం పైన తీసుకుంది. ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలలో పింఛన్ తీసుకుంటున్న వారు అనర్హులే చాలామంది ఉన్నారని గుర్తించారట.


దీంతో అర్హులకు మాత్రమే పింఛని అందించాలని ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని.. ప్రతి నెల 15 వేల రూపాయలు అందుకునే పింఛన్దారుల అనర్హులను గుర్తించింది. ఇందులో సుమారుగా.24, 091 మంది ఉండగా ఇందులో 8,000 మంది అనర్హులుగా ఉన్నారని అంటే సుమారుగా 30% వరకు తేలినట్లు తెలియజేశారు. మిగిలిన వారిలో 9,296 మంది 6000 పింఛనికి అర్హులని తెలియజేశారట. అయితే గత ప్రభుత్వ హయాంలో డాక్టర్లు మధ్యవర్తులు సైతం కుమ్మక్కు అయ్యి ఇలాంటి ద్రోపత్రాలు ఇచ్చారంటూ ఫిర్యాదుల్లో తెలియజేశారు.


దీంతో గత మూడు నాలుగు నెలలుగా దివ్యాంగుల కేటగిరీలో సైతం పింఛని అందుకుంటున్న ప్రతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరి ఒక మెడికల్ టీమ్ వారి యొక్క వైకల్య నిర్ధారణ పరీక్షలను కూడా చేశారట. దీంతో దివ్యాంగుల కేటగిరీలలో మంచానికి పరిమితమైన వారు అలాగే పక్షవాత రోగులు తీవ్రవాదులతో ఇబ్బంది పడుతున్న వారికి ప్రతినెల 15 వేల రూపాయలు అందిస్తున్నారు.అయితే ఇందులో కొంతమంది చేతులు వంకర్లు వినికిడి లోపం అంగవైకల్యం ఇతరత్రా తీవ్రస్థాయిలో లేకపోయిన కూడా ఈ లోపాలు ఉన్నట్టుగా ధూపత్రాలను పొందారట. ఇలా ఇళ్లకు వెళ్లి మరి మెడికల్ టీం 85% వరకు వైకల్యం లేకపోయినా తీసుకుంటున్నారని పరీక్షలలో తేలడంతో ఇక దివ్యాంగుల కేటగిరీలో ఉన్నటువంటి 7.790 లక్షల మందిని కూడా దివ్యాంగులలో పరిశీలించగా సుమారుగా 40 వేల మంది అనర్హులని తేలేరట. వీరందరికీ కూడా పించిని కట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: