ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా ఆ సంచలనమే అవుతుంది. ఆయనను టెక్నాలజీకి మారుపేరు అంటారు.  హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు ఎన్నో కట్టడాలను.. దగ్గరుండి కట్టించారు. ఇప్పటికీ హైదరాబాద్ డెవలప్మెంట్ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని అందరూ చెబుతూ ఉంటారు. అయితే అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం సొంతంగా ఉపగ్రహం పంపిస్తామని ఆయన ప్రకటన  చేయ డం జరిగింది. అవసరమైతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాలు పంపిస్తామని కూడా తెలిపారు. ఉపగ్రహాలు అను  బంధంగా డ్రోన్లు అలాగే సీసీ కెమెరాలు అటు ఐ ఓ టి పరికరాలు అనుసంధానం ఉంటాయని.... ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీటి వల్ల ప్రజలకు రియల్ టైం సేవలు అందించవచ్చు అని ఆయన స్పష్టం చేయడం జరిగింది.

 ఇసుక అక్రమాలు సహా ప్రతి అంశాన్ని రియల్ టైం లో కనిపెట్టేందుకు ఉపగ్రహాలు చాలా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వాటి కార్యదర్శిలు సహా ప్రతి ఒక్కరి ఇలా పని చేస్తున్నారు అనే వివరాలను 360 డిగ్రీలు   మన్నింపు చేస్తామని ప్రకటన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

 ఇలాంటి టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన తెలిపారు. అందుకే ఉపగ్రహాలు పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ఆయన ను టార్గెట్ చేసి సెటైర్లు పేల్చుతుంటే మరి కొంత మంది ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: