
ఇదే అదునుగా చూస్తున్న కూటమి ప్రభుత్వం.. వరుసగా మున్సిపాలిటీలను అలాగే కార్పొరేషన్లను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం రేపుతోంది. రేపు ఉదయం అంటే మంగళవారం రోజున... పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో 9 మంది ఎంపీటీసీలు మాయమయ్యారు. ఆ తొమ్మిది మంది ఎంపీటీసీలు కూడా ఆ వైసీపీ పార్టీకి చెందినవారు కావడం గమనార్హం.
దీంతో ఆ 9 మంది వైసీపీ ఎంపీటీసీలు మిస్సింగ్ అయినట్లు పోలీస్ స్టేషన్లో వైసిపి నేతలు ఫిర్యాదు కూడా చేశారు. అచ్చంపేట మండల పరిషత్ లో మొత్తం 17 మంది ఎంపీటీసీలు ఉంటారు. ఇందులో గత ఎన్నికల్లో 16 మంది వైసీపీ పార్టీ నుంచి గెలిచారు. కూటమి నుంచి కేవలం ఒకే ఒక్కరు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అచ్చంపేట మండల పరిషత్ ను దక్కించుకునేందుకు కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలోనే రేపు ఎన్నికలు ఉన్న తరుణంలో... వైసీపీ ఎంపీటీసీలను టిడిపి నేతలు కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫిర్యాదును కూడా పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఇవ్వడం... జరిగింది. అయితే వైసీపీ ఎంపీటీసీలు కనపడకపోతే... అది తమ తప్పు కాదని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ల విషయాలు తమకు తెలియవని... చెబుతున్నారు. అయితే ఈ సంఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపు తోంది.