
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే వైసిపి సీనియర్ నాయకులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... తన బాత్రూంలో జారిపడ్డారని తెలుస్తోంది. నిన్న రాత్రిపూట ఆయన బాత్రూం లో జారిపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది ఇవాళ ఉదయమే ఆయన జారీపడ్డారని చెబుతున్నారు. స్నానం చేస్తుండగా ఈ సంఘటన జరిగిందట. దీంతో వెంటనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
అయితే... మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్ర రెడ్డి కుడిచేతి ఎముక విరిగి నట్లు వైద్యులు తేల్చారట. ఇక దానికి శస్త్ర చికిత్స కూడా చేశారని సమాచారం అందుతుంది. అనంతరం ఆయన కుడి చేతికి వైద్యులు కట్టు కట్టారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజులు రెస్ట్ తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోలుకుంటారని అవుతారని సమాచారం.
అయితే పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కి గాయం కావడంతో... పుంగనూరు నియోజక వర్గం లో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. తమ నాయకుడికి ఏమైందో అని టెన్షన్ పడుతున్నారు. అయితే వాళ్లందరూ ఎలాంటి ఆందోళన చెందకూడదని మిథున్ రెడ్డి వర్గీయులు.... సోషల్ మీడియా లో ప్రకటన కూడా చేశారు. ఎప్పటిలాగే జనాల్లో... పెద్దిరెడ్డి రామ చంద్ర రెడ్డి తిరుగుతారని కూడా ఆ ప్రకటన చేశారు.