ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు మరణించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి  పెద్దమ్మ సుశీలమ్మ మరణించారు. నిన్న రాత్రి... ఆమె పరిస్థితి విషమించడంతో.. తుది శ్వాస విడిచారు జగన్ పెద్దమ్మ సుశీలమ్మ.  85 సంవత్సరాలు ఉన్న సుశీలమ్మ... దాదాపు రెండు నెలల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 అయితే నిన్నటి రోజున ఆమె పరిస్థితి విషమించడంతో.. వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ సుశీలమ్మ మరణించారు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజశేఖర్ రె డ్డి సోదరుడు ఆనంద రెడ్డి సతీమణిఏ సుశీలమ్మ. ఇక సుశీలమ్మ మరణించిన వార్త తెలియగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

 ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. గత రెండు నెలల కిందట సుశీలమ్మ ఆసుపత్రి పాలు అయినప్పుడు... పులివెందులకు వచ్చి మరి.. జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది.    అయితే రెండు నెలలు  తిరగకముందే సుశీలమ్మ మరణించారు. ఇక సుశీలమ్మ అంతక్రియలు... ఇవాళ జరిగే అవకాశాలు ఉన్నాయి. పులివెందులలోనే సుశీలమ్మ అంతక్రియలు నిర్వహించబోతున్నారు.

 సుశీలమ్మ.. అంతక్రియలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అలాగే వైయస్ భారతి ఇద్దరు కూడా బెంగళూరు ప్యాలస్ లో ఉన్నారు. ఇవాళ హుటాహుటిన  పులివెందులకు వైసిపి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు వైయస్ షర్మిల కూడా... సుశీలమ్మ ఇంటికి ఇవాళ వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: