
గ్రౌండ్ స్థాయిలో వైసీపీ పార్టీకి మంచి ఆదరణ లభించాలంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వల్లే అవుతుందని గ్రహించిన... జగన్మోహన్ రెడ్డి ఆయనకు... ఈ పదవి ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు వైసిపి పార్టీ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. బైరెడ్డి సిద్ధార్థ తో పాటు మరికొంతమంది నేతలకు కీలక పదవులు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. వైసిపి పార్టీ నూతన క్రమశిక్షణ కమిటీని నియమించినట్లు ప్రకటన విడుదలైంది.
క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ని నియమించారు జగన్. అలాగే సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, వై విశ్వేశ్వర్ రెడ్డి, కైలా అనిల్ కుమార్ లాంటి వారికి పదవులు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అటు సిద్ధార్థ రెడ్డికి వైసిపి రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్ష పదవి దక్కింది. అటు ప్రకాశం జిల్లా కు సంబంధించిన కాకుమాను రాజశేఖర పార్టీ వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియామకం కావడం జరిగింది.
ఎన్నారై విభాగం సమన్వయకర్తగా ఆలూరు సాంబశివారెడ్డికి పదవీ కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. త్వరలోనే జగన్ జనంలోకి రాబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అన్ని పదవులను భర్తీ చేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే కీలక పదవులను యంగ్ లీడర్లకు మాత్రమే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ఫార్ములా ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.