
ఖచ్చితంగా ఏపీ కి కూడా ఒక బలమైన రాజధాని ఉండాలి.. అందుకు తగ్గట్టుగా అడుగులు పడుతున్నాయి. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ వస్తుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా చూస్తే ఐసీసీ క్రికెట్ స్టేడియం ఒకటి 1,32000 భారతదేశంలోని అతి పెద్దదైనటువంటి ఎక్కువ జనాభా ఎక్కువ ప్రేక్షకులు కూర్చోగలిగినటువంటి స్టేడియం ఇప్పటిదాకా అహ్మదాబాద్ లో మోడీ స్టేడియం కంటే పెద్దది ప్రిపేర్ చేస్తున్నారు.. అందుకు 200 ఎకరాలు కూడా అడిగారని.. కేశినేని చిన్ని ,అమిత్ షా పర్మిషన్ కూడా ఇచ్చారని విధంగా వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పుడు తాజాగా ఇండియాస్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అమరావతికి 132000 వేల కెపాసిటీ కలిగిన వాటికి అనుమతించారు.. 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీ పెట్టబోతున్నారన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం ఇప్పుడు నేషనల్ గా కూడా డిజిటల్ మీడియా హైలెట్ చేస్తూ ఉన్నది.. మరి ఒకవేళ ఇదే సక్సెస్ గనుక అయితే ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ఇదే రికార్డుగా మిగిలిపోతుందని చెప్పవచ్చు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం కూడా ఎలాంటి విధంగా తెలియజేయలేదు. మరి సీఎం చంద్రబాబుగా ఉన్న సమయంలోనే వీటిని పూర్తి చేస్తారా లేదా చూడాలి.