ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అధికారం వచ్చిందే తడవుగా ఇష్టానుసారం వ్యవహరిస్తూ అక్రమాలకు తెర లేపుతున్నారు. ఒక రాజకీయ నేత తను చెప్పిందే జిల్లా అంతటా సాగేలా పోలీసులకు సైతం షాకిచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.
 
మరో ఎమ్మెల్యే అవినీతి, అక్రమాల విషయంలో తనకు ఎదురే లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆఖరికి ఆ ఎమ్మెల్యే బిచ్చగాళ్ల నుంచి సైతం 100కు 20 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఒక నేత తాజాగా ఒక ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ టాపిక్ అవుతోంది.
 
సీమ ఎమ్మెల్యే గురించి ఈ తరహా ఆరోపణలు వినిపించడం ఇదే తొలిసారి కాదు. ఆ సీమ ఎమ్మెల్యే లేడీ ఎమ్మెల్యే అయినా సంచలన ఆరోపణలు వినిపిస్తుండటం కొసమెరుపు. చంద్రబాబు ఆ ఎమ్మెల్యే విషయంలో వ్యక్తమవుతున్న ఆరోపణల గురించి స్పందిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దౌర్జ్యం, రౌడీయిజం చేసే నేతల వల్ల పార్టీకి లాభం కంటే ఎక్కువగా నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.
 
ఏపీలో 20 కంటే ఎక్కువమంది కూటమి ఎమ్మెల్యేలు ఈ విధంగా అవినీతితో విమర్శలు మూటగట్టుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఏపీ సర్కార్ రాబోయే రోజుల్లో విమర్శలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఏపీ సర్కార్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిన బాధ్యత ఏపీ సర్కార్ పై ఉండటం గమనార్హం. ఏపీ సర్కార్ భవిష్యత్తులో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలను పూర్తిస్థాయిలో మెప్పించాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ తరహా ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: