
ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో మద్యం దుకాణాలలో ఒక బాటిల్ కొంటె మరొక బాటిల్ ఉచితంగా అందిస్తున్నారట. అందుకు సంబంధించి యజమానులు కూడా బోర్డులు పెడుతూ మద్యం ప్రియులను ఆకర్షించే విధంగా చేస్తున్నారట. దీంతో మద్యం ప్రియులు కూడా దుకాణాల ఎదుట క్యూ కడుతూ ఉన్నారు. దీంతో ప్రైవేటు ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా సెలవులు పెట్టి మరి ఈ మద్యం బాటిల్లను తీసుకొని మురిసిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా మద్యం షాపుల వద్ద పోలీసుల బందోబస్తు కూడా ఎక్కువగా ఉంటున్నారట. మద్యం షాపు యజమానులు ఇలా ఆఫర్ ప్రకటించడానికి ఒక ముఖ్య కారణం ఉన్నదట.. అదేమిటంటే యూపీలో ప్రతి ఏటా కూడా లిక్కర్ పాలసీలో భాగంగా లైసెన్సులను జారీ చేస్తూ ఉంటారు.. అలా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కొత్త లైసెన్సులు పొందేవారు మద్యం దుకాణాలను తీసుకుంటారు.. ఇక పాత వాళ్ళ వద్ద ఉన్నటువంటి స్టాకు మొత్తాన్ని కూడా క్లియర్ చేయవలసి ఉంటుంది కనుక ఆ తర్వాత వారు మద్యం అమ్ముకోవడానికి వీలు ఉండదు.. దీంతో ఏప్రిల్ ఒకటవ తేదీలోగా ఉన్న మద్యం స్టాక్ ను మొత్తం పూర్తిగా అమ్మేసుకోవాల్సి ఉండడంతో ఇలా ఒకటి కొంటే మరొకటి ఉచితం అన్నట్టుగా ఆఫర్లను ప్రకటించారట. ఇది ఈ నెల 30వ తేదీ వరకే ఉంటుందట.