కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కు రాజకీయంగా గత ఎన్నికలకు ముందు నుంచి కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే కృష్ణా జిల్లాలో నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం తో పాటు తిరుగులేని రాజకీయ ఆధిపత్యం కొనసాగించారు ఉమా .. అయితే తొలిసారిగా 2019 సాధారణ ఎన్నికలలో తన కుటుంబానికి చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఉమా తొలిసారి ఓడిపోయారు ..
ఎంత విచిత్రం ఏమిటంటే నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పనిచేయడంతో పాటు కృష్ణాజిల్లా రాజకీయాలను శాసించిన ఉమా ఒక్క ఓటమితోనే కెరీర్ పరంగా తలకిందులు అయిపోయారు .. తను ఎవరి చేతిలో అయితే ఓడిపోయాను అదే వ్యక్తిని టిడిపి అధిష్టానం టిడిపిలోకి తీసుకొని అవమానం పక్కన పెట్టి మరి ఎమ్మెల్యే సీటు ఇచ్చింది ఇది ఉమాకు పెద్ద ఎదురు దెబ్బ అనుకుంటే ఇక ఇటీవల కాలంలో మైలవరం ఎమ్మెల్యే తన కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యది అయన వసంత కృష్ణ ప్రసాద్ అండ్ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఇద్దరు కలిసి ఉమాకు మైలవరం నందిగామ నియోజకవర్గాలలో రాజకీయంగా పట్టు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది ..
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ సీట్ల ఎంపికలను ఉమాకు ఎమ్మెల్సీ దక్కకుండా కేసినేని చిన్ని వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు చక్రం తిప్పారు అన్న పుకార్లు షికారులు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలలో వినిపిస్తున్నాయి.. ఇక భవిష్యత్తులో అయినా ఉమాకు ఎమ్మెల్సీ వస్తుందా అంటే ఇప్పటికే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల నుంచి కమ్మ వర్గానికి చెందిన ఆలపాటి రాజా మొన్న ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అలాగే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ కు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు బహిరంగంగా హామీ ఇచ్చారు ..ఈ లెక్కన మరో కమ్మనేత అయిన ఉమాకు ఎలా ఎమ్మెల్సీ పదవి వస్తుంది .. రాజకీయంగా ఆయనకు మరిన్ని కష్టాలు తప్పవా అన్న ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది