
అసలు మూడున్నర సంవత్సరాల పాటు చాలామంది ముఖ్యమంత్రిని కలిసి తమ సాధిక బాదకాలు తమ గూడు చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది .. ఇదే మొన్న ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు .. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీలోనూ అదే పద్ధతి నడుస్తుందా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు పై తీవ్రమైన అసహనంతో ఉన్నారంటే అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి .. కొందరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని ఇప్పటికే బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు .. గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగానే తమ పార్టీ\అధినేత తీరుపై అసహనంతో కనిపిస్తున్నారు .. ఒకటి రెండు విషయాలలో ఆయన ఓపెన్ అయిపోయారు ..
ఇక చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సైతం తమ పార్టీ అధికారంలో ఉండి తాను చెప్పినట్టుగా పోలీసులను బదిలీ చేయించుకోలేక సొంత పార్టీకి చెందిన కార్యకర్తలను బలి పెట్టుకోవాల్సి వస్తుందని మీడియా ముందు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలా బయటకు వచ్చిన వారు వీరిద్దరూ ఇలా బయటకు రాకుండా లోలోపల తమ అసహనం ఆగ్రహంతో రగిలిపోతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఎంతోమంది ఉన్నారని చెప్పాలి .. ఏది ఏమైనా చంద్రబాబు ఎమ్మెల్యేల మనసు గుర్తుతెరిగి అటు ప్రభుత్వానికి పార్టీకి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లక పోతే పార్టీకి ఇబ్బందులు తప్పవు అన్న చర్చలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి ..