వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాని కి పులివెందుల నియోజకవర్గం ఎలాంటి కంచుకోట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచు కోటగా ఉంటూ వస్తోంది .. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కుటుంబం తరఫున వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన భార్య వైఎస్ విజయలక్ష్మి , రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి  , ఎమ్మెల్యేగా విజయం సాధించారు ..
 

అసలు పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని ఓడించడం తెలుగుదేశం పార్టీ వల్ల నాలుగున్నర దశాబ్దాలలో ఎప్పుడు సాధ్యం కాలేదు .. అలాంటి నియోజకవర్గంలో తొలిసారి వైఎస్ ఫ్యామిలీ దూరం జరగాలని ప్రయత్నాలు చేస్తుందా అంటే అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి .. 2029 ఎన్నికలలో వైయస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు కడప జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం గట్టిగా నడుస్తోంది .. జగన్ పులివెందుల నుంచి తప్పుకుంటే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు అన్న ప్రశ్నలు కూడా సహజంగా తెరమీదకు వస్తోంది ..

 

జగన్ పులివెందుల నుంచి తప్పుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి మరో బలమైన నియోజకవర్గంగా ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది .. పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ ఫ్యామిలీ నుంచి జమ్మలమడుగులో ఎవరు పోటీచేసిన 30 వేల పైచిలుక ఓట్లు పడతాయి అన్న విశ్లేషణలు ఎప్పటినుంచో ఉన్నాయి .. ప్రస్తుతం ఇక్కడ నుంచి బిజెపి తరఫున ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు .. ఇక్కడ ఆది కుటుంబానికి కాస్త కూసో పట్టు ఉన్న వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి నిలిచే సత్తా అయితే లేదని అంటున్నారు .. ఏది ఏమైనా జగన్ పులివెందుల ను వదిలిపెట్టి జమ్మలమడుగులో పోటీ చేస్తే కడప రాజకీయాలు ఆసక్తిగా మారతాయి అనటంలో సందేహం లేదు ..

మరింత సమాచారం తెలుసుకోండి: