తిరుమల శ్రీవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎక్కడున్నా... డబ్బులే డబ్బులు. ఆయనకు డబ్బులు అస్సలు కొదవ ఉండదు. తిరుమల శ్రీవారు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రకరకాల రూపాల్లో ఉన్నారు. ఆయనను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. ఇక ఏలూరులో ద్వారకాతిరుమల పేరుతో పూజలు అందుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి.

 ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామి... భక్తుల కోర్కెలను... తీర్చే ఆపన్న హస్తుడిలా మారిపోయారు. ఇక... అలాంటి ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఓ భక్తుడు భారీ విరాళం ఇవ్వడం జరిగింది.  హైదరాబాద్ మహా నగరానికి సంబంధించిన కాకుమాను వెంకటేశ్వరరావు.. అనే భక్తుడు 4.32 ఎకరాల భూమిని విరాళంగా వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన వెంకటేశ్వరరావు... 2004 సంవత్సరంలో.. ద్వారకాతిరుమల మండలం సత్తన్న గూడెంలో 12 ఎకరాలు కొన్నాడట.

 అయితే ఆ భూమిలో ఉన్న 4.32 ఎకరాలు... వెంకటేశ్వర స్వామికి ఇచ్చేందుకు.... కోటేశ్వరరావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భీమడోలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో... తన పేరుపైన ఉన్న భూమిని... ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి పేరుపైన మార్చారు. ఇక ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను ఆలయ ఈవో ఎన్ వి సత్యనారాయణమూర్తికి అందజేయడం జరిగింది.

 ఇక తాను ఇచ్చిన భూమిపై వచ్చే ఆదాయంతో ద్వారక తిరుమలలో ఉన్న  శివయ్య కు ప్రతి నెల రుద్రాభిషేకం అలాగే కళ్యాణం చేయించాలని విజ్ఞప్తి చేశాడు సదరు భక్తుడు వెంకటేశ్వరరావు. ఇది ఇలా ఉండగా... ద్వారకా తిరుమల ఆలయాన్ని చిన్న తిరుమల గా కూడా పిలుస్తారు అన్న సంగతి తెలిసిందే. వెంకటేశ్వర స్వామి వారిని చిన్న వెంకన్న అని కూడా భక్తులు కొలుస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి చిన్న స్థాయి భక్తులు కూడా విరాళాలు ఇస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: