శ్రీశైలం ఎడమ గట్టు కాలువ.. ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ తన్నెల ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతం కారణమని... కొంతమంది చెబుతున్నారు. దాదాపు 35 రోజుల కిందట slbc టన్నెల్ ప్రమాదం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది చిక్కుకున్నారు. ఇందులో ఇద్దరు ఇంజనీర్లు అలాగే ఆరుగురు కార్మికులు ఉన్నట్లు సమాచారం.

 ఇప్పటికే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ నుంచి రెండు మృతదేహాలు బయటకు తీశారు రెస్క్యూ  టీం బృందం సభ్యులు. మరో ఆరుగురి మృతదేహాలు రావాల్సి ఉంది. వాళ్లంతా టింబర్ మిషన్.. ముందు భాగంలో ఇరుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి.   టింబర్ మిషన్ తో పాటు ఆ మృతదేహాలను కూడా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది. ఈ ప్రమాదం 13 కిలోమీటర్ల వద్ద జరిగినట్లు తెలుస్తోంది.

 అయితే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ ప్రమాదానికి.. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న మల్లెల తీర్థం జలపాతం కారణమని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఆ జలపాతం లో ఉండే నీరు టన్నెల్ లోకి ఊట నీరుగా వచ్చి... సొరంగం కుప్పకూలేల... చేసిందని చెబుతున్నారు.  మల్లెల తీర్థం జలపాతం నుంచి వచ్చే నీటిని బయటకు పంపకుండా ఆ స్టోర్ చేశారట. దీంతో సొరంగం పైన మొత్తం నీరంతా మారి.. కూలిపోయేలా చేసిందట.

 2005 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సొరంగ మార్గం పనులు  20 సంవత్సరాలు పూర్తయిన కూడా... పూర్తికాలేదు. ఇప్పుడు మృతదేహాలను తీయడమే కాకుండా టింబర్ మిషన్ తీయాల్సి ఉంటుంది. మళ్లీ అమెరికా నుంచి కొత్త టింబర్ మిషన్ తీసుకువచ్చి... సొరంగం మళ్లీ తవ్వాలి. 13 కిలోమీటర్ల వరకు మళ్లీ కొత్త టింబర్ మిషన్ వెళ్లడం కష్టమే అని అంటున్నారు. ఒకవేళ వెళ్లిన ఈ ప్రాజెక్టు మళ్లీ కూలే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై అనేక అనుమానాలు... చోటు చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: