విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు నందమూరి తారక రామారావు.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేశారు. ఆయన ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మెప్పించారు. సినిమాల్లో తిరుగులేని స్థాయికి ఎదిగిన ఎన్టీఆర్‌ పొలిటికల్ గా కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యారు. తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక.. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా 1982 మార్చి 29 న తెలుగు దేశం పార్టీ స్థాపించారు..తన సిద్ధాంతాలు, హామీలను ప్రజల్లోకి వినూత్నంగా తీసుకెళ్లారు.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే 1983 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అద్భుత విజయం సాధించింది. పేదలకోసం ఎన్నో పధకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, ఆస్తిలో ఆడపిల్లకు భాగం, పేదలందరికి ఇల్లు వంటి పధకాలు అమలు చేసి ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు.

1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా ఎన్నికైన ఎన్టీఆర్ 1989 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన పార్టీని గెలిపించలేకపోయారు.ఇదే సమయంలో రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం ఎంతో ఉదృతమయ్యింది. దూబగుంట రోశమ్మ నాయకత్వంలో ఆనాడు మహిళలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ఈ పోరాటానికి పేద, గ్రామీణ స్త్రీల నుంచి మధ్యతరగతి, పట్టణ స్త్రీల వరకు మద్దతు లభించింది. గాంధీజీ సిద్ధాంతాలను, ఆదర్శాలను అనుసరించే పురుషులు కూడా ఈ సంపూర్ణ మద్య నిషేధానికి మద్దతు తెలిపారు. స్త్రీలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి తమ గ్రామాల నుంచి పోరాటాలు చేశారు.

రోశమ్మ స్పూర్తితో కదిలిన ఆనాటి ప్రతిపక్షనేత ఎన్టీఆర్ తన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వస్తే ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’ అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన మాట మీద వున్న నమ్మకంతో ప్రజలు టీడీపీని భారీ స్థాయిలో గెలిపించారు.ఇచ్చిన మాటకి కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ 1995 జూన్ 1 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ మాట అంటే శాసనమే..మద్య నిషేధం చేసిన గ్రేట్ లీడర్.. ఇప్పుడున్న ఏ నాయకుడికి అలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకునే దైర్యం లేదు.. అందుకే ఇప్పటికీ అన్న గారి సిద్ధాంతాలను పాటిస్తూ టీడీపీ ముందుకు సాగుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: