
- తెలుగు రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది ఏడాదిలోపే అధికారం.!
- ఎన్టీఆర్ మానియా ముందు ఇరుకునపడ్డ కాంగ్రెస్.!
ఒక ఇల్లు కట్టాలంటే పునాది గట్టిగా ఉండాలంటారు పెద్దలు.. అలాగే ఏ పని చేయాలన్నా దాని ముందు చేసే వ్యవస్థ అంత బలంగా ఉండాలి.. ఆ విధంగానే సీనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా రంగం నుంచి ప్రజాసేవ కోసం ప్రజల్లోకి రావాలని ఆలోచన చేసి మేధావులతో చర్చించి చివరికి టిడిపి పార్టీని స్థాపించారు.. అంతేకాదు ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన నిర్విరామ కృషి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసి పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రజలందరిని కూడా పెట్టాడు. కేవలం ఏడాదిలోపే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనుడు సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు..
ఇందిరాగాంధీకి చుక్కలు చూపించిన వీరుడు:
1982 సమయంలో దేశమంతా కాంగ్రెస్ పాలన నడుస్తోంది. ఆ పార్టీకి ఎదురు చెప్పే నాయకుడు ఆ సమయంలో లేరని చెప్పవచ్చు. ఒకవేళ ఎవరైనా పార్టీలు పెట్టిన వారిని ఎలాగోలా చేసి చివరికి కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేసుకునే వారు. అంతటి ఘనత కలిగినటువంటి ఇందిరా గాంధీకే చుక్కలు చూపించిన వీరుడు ఎన్టీఆర్. 1982 మార్చి 29న పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చే సమయం దాకా ఆయనను ఒక సినీ నటుడి గానే సింపుల్గా చూసినటువంటి ఇందిరాగాంధీ, ఎవరి సహకారం లేకుండా ఎక్కువ మెజారిటీ సాధించి అధికారంలోకి రావడంతో ఆమె కూడా అవాక్కయిపోయిందట.. అంతేకాదు ఆయన ఎన్నికల సమయంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు కదిలాడు. పేదవారికి ఉచిత రేషన్ బియ్యం అందించింది కూడా ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.. అంతేకాదు ప్రతి ఒక్కరికి సైకిల్స్ వ్యవసాయదారులకు సబ్సిడీ మీద రుణాలు ఇలా పేద ప్రజలకు సంబంధించిన ప్రతి పథకాన్ని స్థాపించి దేశంలోనే అత్యున్నత ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ వయసు మీద పడ్డ తర్వాత ఆ పార్టీ పగ్గాలను తన అల్లుడు చంద్రబాబు నాయుడుకు అప్పగించారు.. దీంతో చంద్రన్న కూడా మామకు తగ్గ అల్లుడిగా పార్టీని కాపాడుతూ పేద ప్రజలకు అండగా ఉంటూ 2024 లో కూడా అధికారంలోకి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.