దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం ఆవిర్భావించింది. అప్పట్లో అన్నగారు సీనియర్ ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. దాదాపు 50 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ... అఖండ విజయాలతో ముందుకు వెళ్తోంది. పార్టీ ఏర్పాటు అయిన 9 నెలలకే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీగా తెలుగుదేశం రికార్డులు సృష్టించింది. ఈ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత అనేక ఎత్తుపల్లాలు వచ్చాయి. అయినప్పటికీ పార్టీ ఎక్కడ తగ్గలేదు.

 ముందుకు వెళ్లడం తప్ప పార్టీ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అధినాయకత్వం మారినా కూడా తెలుగుదేశం పార్టీకి క్రేజ్ క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని నడిపిస్తున్నారు. ఈ పార్టీ ద్వారా దాదాపు నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన తెలుగుదేశం పార్టీ పడగొట్టింది.

 160 కి పైగా స్థానాలను కూటమి ప్రభుత్వం  దక్కించుకోవడంలో... తెలుగుదేశం పార్టీ కీలకమైంది. అయితే అలాంటి తెలుగుదేశం పార్టీ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డిని... ఓడించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు... బలమైన వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలను కూడా ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి 2024 అసెంబ్లీ ఎన్నికల కీలకము.


 ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయింది. దానికి తోడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలు పాలయ్యారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ఎలా తీసుకు వస్తాడని అందరూ చర్చించుకున్నారు. అటు వైసిపి పార్టీ గ్రౌండ్ స్థాయిలో బలంగా తయారయింది. కానీ వెనక్కి తగ్గలేదు తెలుగుదేశం. బిజెపి అలాగే జనసేన పార్టీ సహాయం తీసుకొని... ఆ పార్టీకి ఊపిరి పోసారు చంద్రబాబు నాయుడు. దీంతో మళ్లీ అఖండ విజయంతో ముందుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. కొత్త నాయకత్వం వస్తోంది. త్వరలో నారా లోకేష్ కూడా పార్టీ బాధ్యతలు తీసుకున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరో 50 ఏళ్లు ఈ తెలుగుదేశం పార్టీ కొనసాగడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp