
అయితే ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ ,జడ్పిటిసి ఎన్నికలు చాలా హోరా హోరిగా జరిగాయి. ఇందులో చాలా స్థానాలు వైసిపి పార్టీ గెలుచుకున్నట్లు తెలుస్తోంది.. కడప, తిరుపతి రూరల్, పల్నాడు జిల్లా అచ్చంపేట, సత్యసాయి జిల్లా రామగిరి, కాకినాడ రూరల్ వంటి ప్రాంతాలలో జడ్పీ చైర్మన్ Mpp, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ ఇలా ఎన్నో స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ గాని రాజకీయాలకు తెరలేపేలా చేశాయి. ఇందులో భాగంగా వైసిపి ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన మాజీ ఎమ్మెల్యే నగరి రోజా ఈ ఎన్నికలలో గెలిచారు . విజయపురం మండలం వైస్ ఎంపీపీ స్థానాన్ని సైతం అక్కడ వైసిపి పార్టీ ఏకగ్రీవం సాధించిందట. వైసిపి అభ్యర్థి కన్నమ్మ గెలిచారు. ఈ విషయం పైన మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ వైసీపీ క్యాడర్ కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ విజయం సాధించిందని తెలిపింది. అలాగే కన్నెమ్మను శాలువతో సత్కరించింది. అలాగే కడపలో జడ్పీ చైర్మన్ పదవి కూడా వైసిపి పార్టీని కైవసం చేసుకున్నది. రామ గోవిందరెడ్డి ఏకగ్రీవం అయ్యారట.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా జడ్పిటిసి మండల పరిషత్లో 53 పదవులకు ఉప ఎన్నికలు జరగగా ఇందులో వైసీపీ పార్టీ 32 పదవులను సొంతం చేసుకుందట.. గతంలో ఈ 53 పదవులు కూడా వైసిపివే అయినా కొన్ని కారణాల చేత కాలి అవ్వడంతో ఇప్పుడు ఎన్నికలు జరిపించారు. ఇందులో కూటమిలో భాగంగా టిడిపి తొమ్మిది గెలవగా 32 స్థానాలు వైసిపి మరో 10 చోట్ల వాయిదా వేశారు.