తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీలో సస్పెన్స్ నడుస్తూనే ఉంది .. నాలుగు ఐదుగురు నేతలు గట్టిగా ఈ పదవి పై గట్టిగానే తమ ప్రయత్నాలు చేస్తున్నారు .. పైకి మాత్రం తాము రేస్ లో లేమని హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు .. కానీ పార్టీ హై కమాండ్ ఏం ఆలోచిస్తుందో ఇంకా ఎవరిలోనూ క్లారిటీ లేదు .. దానికి ఎవరికీ సంకేతాలు రాలేదు .. దాంతో అధికార ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు .తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ ను ఎన్నికలకు ఐదు నెలల ముందు ఊహించ‌ని విధంగా తప్పించారు .. కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డిని ఎందుకు అధ్యక్షుడు చేశారో సగటు బిజెపి కార్యకర్తలు కూడా ఇప్పటికే అర్థం కాలేదు ..


అలాగే కేంద్రమంత్రిగా ఉంటూ ఓ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కొనసాగించేందుకు బిజెపి పెద్దలు ఎప్పుడూ సిద్ధంగా ఉండరు .. ఒకరికి ఒకే పదవి అనే సిద్ధాంతాన్ని గట్టిగా అమలు చేస్తారు .. అయితే కొంతకాలం అమిత్ షాకు మాత్రమే ఈ మినహాయింపు లభించింది .. అయితే ఇప్పుడు ఆయన కంటే ఎక్కువగా కిషన్ రెడ్డికి ఈ రెండు పదవుల్లో అవకాశం లభించింది .. ఇక దీనికి కారణం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కేంద్ర బిజెపి పద్దలు ఉండటమే అని అంటున్నారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కాబోయే వారిపై చాలా పెద్ద పని పడుతుంది ఎందుకంటే బిజెపి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది .. పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా ఓటు బ్యాంకు ని కూడా పెంచుకుంది .. ఇలా బిజెపి ఓటు బ్యాంకును క్రమంగా తమ వైపు తిప్పుకుంటున్నారు ..


ఇటువంటి స‌మ‌యంలో దూకుడుగా ఉండి పార్టీని యాక్టివ్ గా ఉంచుతూ కార్యకర్తలను పార్టీ పనిమీద నడిపించే నాయకుని ఎంపిక చేయాల్సి ఉంటుంది .. ఈసారి తప్పు జరిగితే బిజెపికి మరోసారి అధికారం అందరిని దాక్షాగానే మారుతుంది . బండి సంజయ్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కాకముందు బిజెపి పరిస్థితి ఎంతో ఘోరంగా ఉండేది . కానీ ఆయన పదవిలోకి వచ్చాక ఎవరు ఏమన్నా తనదైన రీతిలో పార్టీని బలోపేతం చేశారు .  బిజెపి  , బీఆర్ఎస్ మధ్యనే అసెంబ్లీ వార్‌ జరుగుతుందన్న సమయంలో ఆయన్ను మార్చడంతో ఒక్కసారిగా సీను మారిపోయింది .. ఇక పార్టీ హైకమాండ్ వ్యూహం ఏమిటో కానీ ఇప్పుడు మరోసారి అలాంటి తప్పు చేయవద్దని బండి సంజయ్ కి అవకాశం ఇవ్వాలని కేడర్ గట్టిగా కోరుకుంటున్నారు .. ఇతర నాయకులకు అవకాశం ఇస్తే అది మరో తప్పుగా మారుతుందని కూడా అంటున్నారు .. ఇక మరి దీనిపై కేంద్ర పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp