తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలో నిజంగానే చరిత్ర తిరగరాసిన పార్టీ .. ఈనెల 29 అనగా రేపు ఈ పార్టీ పెట్టి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది .  43వ సంవత్సరంలో అడుగుపెడుతుంది .  ఈ క్రమంలోనే మే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటినుంచి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు అంటేనే ఎంతో స్పెషల్ .. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీని చూడాలి .. అయితే ఈసారి మహానాడు టిడిపికి ఎంతో ప్రత్యేకంగా మారింది .. 2019 నుంచి 2024 మధ్యలో టీడీపీకి ఎన్నో రకాల సవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు నడిచింది . కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచిన ఆ పార్టీ వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడికి టార్గెట్ కి ఎంతగానో నలిగిపోయింది . ఒక దశలో ఏకంగా పార్టీ పెద్ద చంద్రబాబును అరెస్ట్ చేయడంతో టిడిపి అతిపెద్ద సంక్షోభం వైపుగా అడుగులు వేసింది .. అయితే ఆ అరెస్టునే విజయానికి మెట్లుగా మలుచుకొని వీరవిహారం చేసింది .. 2024 ఎన్నికల్లో కొడితే కొట్టాలి 6 అంటూ ఏకంగా 164 సీట్లతో కూటమి విజయం సాధించింది .. ఇలా గత పది నెలలగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుంది .
 

ఇక చంద్రబాబు నాలుగోసారి సీఎం గా బాధితులు చేపట్టారు .. ఇక లోకేష్ కీలక శాఖలు చూస్తూ బాబుకు సరిజోడిగా ఒక వెలుగు వెలుగుతున్నారు .. ఇంత జరుగుతున్న టిడిపి ప్రభుత్వాన్ని కాకుండా కూట‌మి ప్రభుత్వామ‌ని చెప్పటమే పార్టీలోని హార్డ్ కోర్ అభిమానులకి కొంత కష్టంగా మారింది .. అంతేకాకుండా ఏ పదవి వచ్చినా కూటమిలోని పార్టీలతో షేర్ చేసుకోవడంతో ఎప్పటినుంచో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎందరో టిడిపి కార్యకర్తలకు నిరాశ్రే మిగులుతుంది .  వీటితోపాటు జనసేన ఆవిర్భావ సభలో ఇటీవల పార్టీ పెద్దలు చేసిన కామెంట్లు కొంత భిన్నంగా ఉన్నాయి .. టిడిపిని తామే నిలబెట్టామని చెప్పడం కూడా టీడీపీ అభిమానుల‌ని తీవ్రంగా బాధిస్తుందని అంటున్నారు . ఒంటరిగా టిడిపి గెలవలేదు అని వైసిపి ఒకవైపు సూటి పోటీ మాటలు అంటూ వస్తుంది మేము గెలిచినా వాడిన సోలో అని కూడా అంటున్నారు . అంతకు మూడింతలు వయసు పెద్ద పార్టీగా ఉన్న టిడిపికి ఇలాంటి కామెంట్స్ రావ‌డ‌మేంటి అన్న చర్చ తెలుగు తమ్మూల్లో తీవ్రంగా మెదులుతుంది .. ఒంటరిగా పోటీ చేసిన టిడిపి గెలుస్తుందని దాన్ని నిజం చేసి రుజువు చేయాల్సింది అధినాయకత్వం అని అంటున్నారు .. అయితే టిడిపి అధినాయకత్వం ఇప్పుడు ఊహించని రాజకీయ డైలీ మాలో ఉందని కూడా అంటున్నారు . ముందుగా ప్రత్యర్థిగా ఉన్న జగన్ వైసీపీ పార్టీకి అవకాశం ఇవ్య‌కుడాదు అంటే కచ్చితంగా పొత్తుతోనే ఉండాలి .. ఇలా పొత్తుతో ఉంటే జనసేన ను కలుపుకొని వెళ్లాలి ఇక పొత్తు పార్టీలో చేసే వ్యాఖ్యలు బాధించిన అది పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని పెద్దలు అంటున్నారు .. ఇక మరోవైపు చూస్తే ఇంకో చర్చ కూడా ఉంది. జగన్ ప్రత్య‌ర్థి కచ్చితంగా ఎదురుగా కనిపించే విషయం ఈ మాటకు వస్తే జనసేన కూడా ఏదో ఒక రోజు ప్రత్యర్థిగా మారదా అన్న చర్చ కూడా ఉంది .. ఆ రోజున పొత్తుతో కలిసి బలం పంచుకొని రేపటి రోజున ఎదురు వస్తే అప్పటి సంగతి ఏంటి అన్నది కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా త్యాగాలు చేయదు కదా అంతిమ లక్ష్యం అధికారమే కదా అన్నది పసుపు  సైనికుల వాదన.


జగన్ కి అర్థబలం అంగ బలం ఉంటే పవన్ కి సినీ గ్లామర్ బలమైన సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉన్నాయి .  మరోపక్క బీజేపీ అండకూట ఉంది .. ఇవన్నీ కలిస్తే జనసేన కూడా ఏదో ఒక నాటికి ఏకు మేకుగా మారకుండా ఉంటుందా అనే చర్చ కూడా ఉంది .. ఇక రాజకీయంగా ఎంతో కామెడీగా తీసుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా తేజాగా కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు .  పవన్ ని పెంచి పోషిస్తున్నారని ఇది రాబోయే రోజుల్లో టిడిపికి ఇబ్బంది అని హెచ్చరిస్తూ ఆయన కామెంట్లు చేశారు . ఇలా టిడిపిలో ఈ పొత్తుల పట్ల మిత్రుల పట్ల ఎంతో ఊహించని అంతరమద‌ణం ఉన్న అది  అనివార్యంగానే ఉంది అని పెద్దలు చెబుతున్నారు .  ఇక వైసీపీని రాజకీయంగా పక్కకు తెప్పిస్తే ఆ తర్వాత కథను చూసుకోవ‌చ్చు అన్నది టిడిపి పెద్దలు వ్యూహం కూడా కావచ్చు .  కానీ వైసీపీని పక్కకు తప్పించడం ఎలా అవుతుంది ? అన్నది మాత్రం ఊహించిన ప్రశ్న .. అది జగన్ చుట్టూ అల్లుకున్న పార్టీ ఒక జగన్ చాలు మళ్ళీ అధికారంలోకి తీసుకురావటానికి .. పైగా జగన్ కు వయసు కూడా రాజకీయంగా చాలా ఉంది .. ఈ విధంగా చూసుకుంటే టిడిపి వ్యూహంలో ఎక్కడో తేడా కొడుతుంది అన్నది కూడా కార్యకర్తల్లో ఉంది .. ఇలా మొత్తంగా కూటమి నుంచి టిడిపి బయటకు రాలేదు .  ఈ రాజకీయ నాగబంధం నుంచి బయటకు రాలేదు .. ఇక మరి రేపటి రోజున చంద్రబాబు పక్కకు వెళ్తే లోకేష్ కి ఈ చిక్కుముడుల నుంచి పార్టీని బయటకు తీసుకురావటం వీలు అవుతుందా అనేది ఎవరికీ తెలియని అంతు చిక్కని ప్రశ్నగా మారిందని కూడా అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: