ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అధికారం తమ చేతిలో ఉన్న నేపథ్యంలో కూటమి పార్టీలు ఎంతకైనా తెగిస్తున్నాయని.. విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా.. మున్సిపాలిటీలు అలాగే స్థానిక సంస్థల్లో బాగా వేసేందుకు కూటమి పార్టీలు.. ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా... జనసేన పార్టీ కీలక స్థానాన్ని దక్కించుకుంది. మొన్నటి వరకు ఎమ్మెల్యే ఎన్నికల్లో దుమ్ములేపిన జనసేన... ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రఫ్ఫాడిస్తోంది.

 కాకినాడ రూరల్ ఎంపీపీ పదవిని  స్కెచ్ లు వేసి మరి జనసేన దక్కించుకోవడం జరిగింది. జనసేన వేసిన స్కెచ్ కు వైసీపీ పార్టీ చిత్తయింది. దీంతో వైసిపి కంచుకోటగా చెప్పుకునే కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి దక్కించుకుంది జనసేన. వాస్తవానికి 2021 సంవత్సరం లో జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో... అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ దుమ్ము లేపింది. మెజార్టీ స్థానాలన్నీ దక్కించుకుంది వైసిపి పార్టీ.

 అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... లెక్కలన్ని మారిపోతున్నాయి. వైసిపి దక్కించుకున్న స్థానాలను మళ్లీ కూటమి పార్టీలు దక్కించుకుంటున్నాయి.  తాజాగా కాకినాడ రూరల్ మండల పరిధిలో ఏడుగురు వైసీపీ ఎంపీటీసీలు.. కండువా మార్చేశారు. జనసేన గూటికి చేరి పవన్ కళ్యాణ్ కు జై కొట్టారు వైసీపీ ఎంపీటీసీలు. ఇక మిగిలిన 8 మంది ఎంపీటీసీలు మాత్రం వైసిపి పార్టీలోనే కొనసాగారు.

 ఈ నేపథ్యంలోనే గురువారం రోజున కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక జరిగింది. అయితే జనసేనలో చేరిన ఏడుగురు ఎంపీటీసీలు... వచ్చి తమ మద్దతు ను జనసేనకు ప్రకటించారు.  అటు వైసీపీలో ఉన్న నేతలు మాత్రం అసలు ఎన్నికకే రాలేదు. దీంతో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. జనసేన అభ్యర్థి అనంతలక్ష్మి ఎంపీపీగా ఏకగ్రీవం కావడం జరిగింది. ఇలా జనసేన పార్టీ స్కెచ్ వేసి మరి వైసీపీ కంచుకోట ను దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: