
వాళ్లతోనే కూర్చుంది... వారం రోజులుగా వాళ్లతోనే గడిపింది. హౌస్ లోకి కూడా టిడిపి నేతలతో కలిసి వెళ్లింది ఎంపిటిసి సృజన. కానీ ఓటు వేసే సమయానికి.. వైసీపీ పార్టీకి మద్దతుగా ఎంపిటిసి సృజన... చేయి లేపారు. అయితే ఎంపీటీసీ మాలపాటి సృజన... ఉన్నఫలంగా వైసీపీ పార్టీకి మద్దతు తెలపడం వెనుక వైసిపి ఎమ్మెల్యే చంద్రశేఖర్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి నేతలతోనే దాదాపు వారం రోజులపాటు మాలపాటి సృజన గడిపారు.
ఆ పార్టీకే మద్దతు తెలుపుతానని కూడా స్పష్టం చేశారు ఎంపీటీసీ మాలపాటి సృజన. అయితే ఎన్నిక సమయానికి.. టిడిపికి షాక్ ఇస్తూ వైసిపికి నా ఓటు అంటూ చేయి లేపారు. దీంతో టిడిపి కూటమి కుదేలైపోయింది. తనను బలవంతంగా టిడిపి పార్టీకి ఓటు వేయించాలని కుట్రలు చేశారని అనంతరం ఎంపీటీసీ మాలపాటి సృజన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రలోభాలకు గురి చేశారని ఆమె పేర్కొన్నారు.
కానీ ఎన్నిక సమయానికి మాత్రం తాను జగనన్నకు ఓటు వేశానని గుర్తు చేశారు. జగనన్న అంటే తనకు ఎంతో అభిమానమని.. అలాంటి జగనన్నకు వ్యతిరేకంగా తాను ఓటు వెయ్యబోనని ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఇక మాలపాటి సృజన చేసిన పని పట్ల వైసిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి సంపాదించుకున్న వారు పార్టీని విడిపోతున్న ఓ మహిళ మాత్రం తన పార్టీ పైన విధేయతను చాటిందని వైసిపి నేతలు పొగడ్తలు కురిపిస్తున్నారు.