ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందనే సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉండటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
ప్రస్తుతం ఏపీకే పరిమితమై ఉన్న వైసీపీ నేతలు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. ఆ నేతలలో కూడా కొంతమంది మాత్రమే ధైర్యం చేసి మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలా ధైర్యం చేసి మాట్లాడిన నేతలు కేసులు చుట్టుకోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కోర్టులకు వెళ్లి తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితిని ఈ నేతలు ఎదుర్కొంటున్నారు.
 
కాకాని గోవర్ధన్ రెడ్డి, విడదల రజినీ, వల్లభనేని వంశీ, సజ్జల భార్గవ్, లేళ్ల అప్పిరెడ్డి మరి కొందరు నేతలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రాబోయే రోజుల్లో మరి కొందరు వైసీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి నేతలు వైసీపీని నిర్వీర్యం చేసే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
వైసీపీ నేతలు ఎదుర్కొంటున్న తరహా పరిస్థితిని మరే రాష్ట్రంలో నేతలు ఎదుర్కోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు రాబోయే రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ సైతం ఈ తరహా పరిస్థితులపై ఒకింత దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈ తరహా పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇండస్ట్రీకి తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.




 


మరింత సమాచారం తెలుసుకోండి: