సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో కొంతమంది నాయకుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ గొడవలు ఒక్కోసారి  తారా స్థాయికి చేరి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంటాయి. కేశినేని నాని, కోలికపూడి మధ్య వచ్చినటువంటి ఈ రచ్చ టీడీపీ ప్రతిష్టను భారీగా దెబ్బతీస్తోంది. వారి మధ్య ఎక్కడ  విభేదాలు వచ్చాయి ఆ వివరాలు  ఏంటో చూద్దాం.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు అయినటువంటి  అల్వాల రమేష్ రెడ్డిని టిడిపి నుంచి సస్పెండ్ చేయాలని  కొలికపూడి శ్రీనివాస్ హడావిడి చేస్తున్నారు. అయితే ఆయన ఒక గిరిజన మహిళపై లైంగిక వేధింపులు చేస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొలికపూడి శ్రీనివాస్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. 

ఇప్పటికే గిరిజన మహిళ సంఘాలంతా వచ్చి కొలికపూడి ఇంటి ముందు ధర్నా చేయడంతో 48 గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయనపై టిడిపి అధిష్టానం చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని కొలిపూడి శ్రీనివాస్ గిరిజన మహిళలతో అన్నాడు. ఇదే తరుణంలో రమేష్ రెడ్డి కేశినేని చిన్ని పిఏకు కాస్త నగదు ఇచ్చి తనను కాపాడాలని వేడుకున్నట్టు శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో కొలికపూడికి పార్టీ నుంచి పెద్దగా సపోర్టు లేకపోయినా అమరావతి ఉద్యమం వల్ల పేరు వచ్చింది. దీంతో చంద్రబాబు ఆయనను పిలిచి టిడిపి టికెట్ ఇవ్వడంతో అనూహ్యంగా ఆయన గెలవగలిగారు. ఈ తరుణంలో వైసిపి నేతలు మాత్రం టిడిపి ఎంపీకి, ఎమ్మెల్యేకు మధ్య వాటాల విషయంలో వచ్చిన విభేదాలు  రచ్చలేపుతున్నాయని ఆరోపించారు.

 మైనింగ్, మద్యం, అక్రమ ఇసుక రవాణాల్లో వీరి మధ్య  విభేదాలు వచ్చాయని  వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే తరుణంలో కేశినేని చిన్నిని పరోక్షంగా కొలిక పూడి శ్రీనివాస్ టార్గెట్ చేశారని, రమేష్ రెడ్డిని అడ్డుగా పెట్టుకుని ఈ విధంగా రచ్చ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ఒకే పార్టీకి చెందినటువంటి ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం ముదరడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధం దొరికిందని చెప్పవచ్చు. మరి దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి ఈ వివాదాన్ని సర్ధుమనిగిస్తుందా లేదంటే  ఇద్దరు నేతలపై ఏదైనా చర్యలు తీసుకుంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: