
మరికొంతమంది విజయసాయిరెడ్డి లాంటివారు రాజకీయాలకు గుడ్ బై చెప్పి... జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని... బాంబు పేలుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ముగ్గురి నుంచి గండం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ముగ్గురిలో నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. గతంలో వైసిపి పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించారు.
కానీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి బయటికి వెళ్లి టిడిపిలో చేరారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పై లిక్కర్ స్కామ్ అంటూ... సంచలన ఆరోపణలు చేస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన.. లిక్కర్ స్కాం పైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసిపి కి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా జనసేన కండువా తప్పుకున్నారు.
జనసేనలోకి వెళ్ళగానే జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేయడం జరుగుతుంది. వెంటనే దీనిపై విచారణ చేయాలని అంటున్నారు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అటు విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ తో దెబ్బ కొడుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొంతమంది కోటరీ సృష్టించారని ఆయన బాంబు పేల్చారు. దాంతో వైసిపి క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. ఇలా ముగ్గురు నేతలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారు.