
ఇప్పటికే రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వాల సైతం ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకు సైతం పెద్దగా ముస్లింలు హాజరు కాలేదట. బీహార్ వంటి ప్రాంతంలో పూర్తిగా బహిష్కరించారు.. కానీ ఏపీలో కొంతమంది కూటమి నేతలు ఒత్తిడి చేయడంతో ముస్లిం పెద్దలు హాజరైనారని వార్తలు వినిపిస్తున్నాయి. గడిచిన ఎన్నికలలో టిడిపి పార్టీ కూటమిలో భాగంగా ముస్లింలకు ఇబ్బంది కలిగించేలా హక్కులు తెస్తే అడ్డుకుంటామంటూ తెలియజేశారు.. కానీ ఇప్పుడు వాటన్నిటినీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చిన వినతి పత్రాలను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకొనిపోతోందట కేంద్ర ప్రభుత్వం.
దీంతో ఏపీలో భారీగా ముస్లింలు సైతం నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విజయవాడలో భారీ ఆందోళన చేపట్టడానికి శ్రీకారం చుట్టినట్లుగా సమాచారం .ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజయవాడలో ధర్నా చేయబోతున్నారట ముస్లింలు. టిడిపి పైన కూడా వర్క్స్ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని ఒత్తిడిని కూడా ముస్లిం పెద్దలు తెలియజేస్తూ నిరసనలు చేపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మైనార్టీల విషయంలో అటు సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఒకవైపు కేంద్రం మరొకవైపు మైనారిటీస్ వల్ల సీఎం చంద్రబాబు అయోమయంలో పడిపోయారు.