ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి లో సొంత ఇల్లు నిర్మించుకోబోతున్నారు .. ఇందు కోసం ఆయన వెలగపూడి లో 5 ఎకరాల స్థలం కూడా కొనుగోలు చేశారు .. సీఎం చంద్రబాబు కృష్ణా ది ఒడ్డున ఉండవల్లిలో లింగమనేనికి చెందిన అతిథి గృహంలో గత పదేళ్లుగా ఉంటున్నారు. తాజాగా అమరావతిలో సువిశాల స్థలాన్ని కొనుగోలు చేశారు. భవిష్యత్తు కుటుంబ అవసరాలు, తన హోదా, వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థలం వైపు మొగ్గు చూపారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న 25 వేల చదరపు గజాల ప్లాట్ అనుకూలంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు.


ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరున ఉన్న రిటర్నబుల్ ప్లాట్. ఇప్పటికే రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలిసింది .. ఈ 6 రోడ్డు కు దగ్గర లో ఉండే ఈ స్థలాని కి నాలుగు వైపులా రోడ్డు ఉంటుంది .. అంతే కాకుండా అమరావతి లో కీలకమైన సీడ్ యాక్సిస్ హైవే కు దగ్గరగా ఉంటుంది .. అలాగే హైకోర్టు విట్ , గవర్నమెంట్ కాంప్లెక్స్ , గెజిట్ ఆఫీసర్స్ ఎన్జీవోల నివాస సదుపాయాల కు చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలాని కి కేవలం రెండు కిలో మీటర్ల దూరం లోనే ఉన్నాయి .  అలాగే ఐదు ఎకరాల స్థలం లో ఇంటి నిర్మాణం తో పాటు ఉద్యానవనం సెక్యూరిటీ సిబ్బంది కి గదులు వాహనాల పార్కింగ్ వంటి సద్దుపాయాల కు కూడా వినియోగించాలని చంద్రబాబునిర్ణయించారు ..



అలాగే సాధ్యమైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి అమరావతి లో గృహప్రవేశం చేయాలని భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది .  అలాగే అమరావతి పుణ్య నిర్మాణ కార్యక్రమా లు మొదలు అవడాని కి ముందే ఇంటి నిర్మాణాని కి చంద్రబాబు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారట .  అలాగే అమరావతి పూన నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి  ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్న విషయం కూడా తెలుస్తుంది .. ఈ లోపు తన సొంత ఇంటి నిర్మాణాని కి భూమి పూజ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు .  అలాగే అందుకు ఏప్రిల్ 9న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: