తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్  ఇంటర్నల్ సర్వే నిర్వహించినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.  ఈ సర్వే ప్రకారం గులాబీ పార్టీకి 85 నుంచి 87 స్థానాలు వస్తాయని... ప్రచారం జరుగుతోంది. అదే కాంగ్రెస్ పార్టీకి మాత్రం 8 నుంచి 10 సీట్లు మాత్రమే దక్కుతాయని... కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే తేల్చి చెప్పిందట.



ఇక భారతీయ జనతా పార్టీకి 15 నుంచి 17 స్థానాలు దక్కుతాయని వెల్లడించిందట. ఎప్పటిలాగే ముస్లిం పార్టీ అయినా mim 7 నుంచి 8 స్థానాలు వస్తాయని చెబుతున్నారు. అంటే.. ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీని తెలంగాణ ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అటు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉన్నట్లు ఈ సర్వే తేల్చేసిందని ఈ సమాచారం అందుతుంది.


ఇక భారతీయ జనతా పార్టీ పుంజుకొని రెండవ స్థానాన్ని దక్కించుకోబోతుందని కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలో తేలిందని సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు దాదాపు అందరూ ఓడిపోతారట. తెలంగాణ మంత్రులుగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు అలాగే ఉత్తంకుమార్ రెడ్డి మినహా అందరూ మంత్రులు ఓడిపోతున్నట్లు ఈ సర్వేలో తేలిందని ఈ ప్రచారం జరుగుతుంది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటు గురించి మాత్రం ఈ సర్వేలో ఎక్కడ పేర్కొనలేదు.

 అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే.   హైదరాబాదులో మరోసారి గులాబీ పార్టీ జోరు స్పష్టంగా ఉంటుందని తేల్చింది. అయితే ఈ ఇంటర్నల్ సర్వే నేపథ్యంలోనే స్థానిక సంస్థలను వాయిదా వేస్తోందట కాంగ్రెస్ పార్టీ. అయితే ఇందులో ఎంత మెరుగు వాస్తవం ఉందో తెలియదు కానీ.. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త చెక్కర్లు కొడుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: