ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నారు. అయితే ఈయన నిలబడిన నియోజకవర్గం పిఠాపురం మాత్రం రాజకీయ విషయాలలో నిరంతరం హాట్ టాపిక్ గా  మారుతూనే ఉన్నది. ముఖ్యంగా అక్కడ టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ స్థానాన్ని పవన్ కళ్యాణ్ కి ఇవ్వడంతో అప్పటి నుంచే అక్కడ పవన్ కళ్యాణ్ కి ఎంత పేరు ఉందో వర్మకి అంతకంటే ఎక్కువ పేరు ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మని పట్టించుకోవడం మానేశారు.



దీంతో ఎన్నో సందర్భాలలో అటు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవడం వెనుక వర్మ హస్తం లేదని  జనసేన నేతలు మెగా కుటుంబ సభ్యులు కూడా ఇటీవలే సభలో అనడం జరిగింది. దీంతో అప్పటినుంచి పిఠాపురంలో వర్మ తన హవా మళ్లీ కొనసాగించాలని చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే పూర్తిగా వ్యవహారాలను వర్మ పిఠాపురంలో తనవంతుగా పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుద్ధ్యం లోపించింది అంటూ అందుకు సంబంధించి వర్మ ఒక వీడియోని షేర్ చేస్తూ ఇదంతా కూడా అధికారులు నిర్లక్ష్యం వల్లే జరిగింది అంటూ తెలియజేస్తున్నారు.


దీంతో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ప్రశ్నించినట్లుగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు వర్మ అంటూ జనసేనకుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా పిఠాపురంలో అటు జనసేన నేతలు వర్మ మధ్య కూడా వారు జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ కోసం వర్మ సీటు త్యాగం చేసి ఉండకపోతే గెలిచేవారు అంటూ టిడిపి కార్యకర్తలు వర్మ అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వర్మకి చాలా చోట్ల కూడా ఇలా  ఇబ్బందులు తలెత్తుతూ ఉండడంతో వర్మ ఇకమీదట ప్రజలలోనే ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పిఠాపురంలో వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: