తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణలో... కొత్త కొత్త పేర్లు తెరపైకి.. వస్తున్నాయి.  మార్చిలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే ఉగాది తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని ఇప్పుడు జోరుగా ప్రచారం అందుకుంది. దీనికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,  కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఉత్తంకుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లి చర్చలు నిర్వహించారు.


 మరోసారి కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో.. తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఎవరి పేరు... వస్తుందో అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. మొన్నటి వరకు... వి6 వివేక్ వెంకటస్వామి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు పోటీగా... చాలామంది దళిత నాయకులు వస్తున్నారట. దీంతో అతనికి మంత్రి పదవి రావడం చాలా కష్టమే అని చెబుతున్నారు.

 అనుషంగా విజయశాంతి తెరపైకి వచ్చారు. తెలంగాణ కేబినెట్ లో ఇప్పటికే కొండా సురేఖ అలాగే  సీతక్క లాంటి వారు ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఓడిపోయిన చరిత్ర లేని సీతక్కను పక్కకు పెట్టడం చాలా కష్టం. అందులోనూ ఆమె... సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన బంటు. కాబట్టి ఆమెపై వేటుపడటం చాలా కష్టం. అయితే కొండా సురేఖ పైన వేటుపడడం గ్యారంటీ అంటున్నారు.

 తెలంగాణ కేబినెట్ విస్తరణ అయినప్పటి నుంచి కొండా సురేఖ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. కేటీఆర్ అలాగే సమంత పై విమర్శలు చేయడం ఆ తర్వాత వేములవాడ రాజన్న సన్నిధిలో కోడెల మిస్సింగ్, తన ఇంట్లో బర్త్డే వేడుకలు.. ఇలా అనేక వివాదాలు నెలకొన్నాయి. దీంతో ఆమెను తప్పించి రాములమ్మకు చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అలాగే జూపల్లి కృష్ణారావు స్థానంలో... మంచిర్యాల ఎమ్మెల్యే కు ఛాన్స్ వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: